Health Tips: ఈ 5 ఆహారాలను అస్సలు ప్రెజర్ కుక్కర్‌లో వండొద్దు.. ఆరోగ్యం పాడైపోతుంది.. తప్పక తెలుసుకోండి..
అయితే, కొన్ని ఆహారాలు మాత్రం ప్రెషర్ కుక్కర్ వండకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే.. అవి ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చిపెడతాయి. వంట అనేది ఒక కళ మాత్రమే కాదు.. సైన్స్‌కు సంబంధించినది కూడా. ఇవాళ మనం వంట చేయడం వెనుక ఉన్న సైన్స్ మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా సైన్స్ ప్రకారం ప్రెజర్ కుక్కర్‌లో ఎలాంటి ఆహారం వండకూడదతో ఓసారి తెలుసుకుందాం..
ఆహారాన్ని త్వరగా, తక్కువ సమయంలో వండటానికి చాలా మంది తరచుగా ప్రెజర్ కుక్కర్‌ను ఉపయోగిస్తారు. ప్రెజర్ కుక్కర్‌లో నచ్చిన ఆహారాన్ని సులభంగా వండుకోవచ్చు. అయితే, కొన్ని ఆహారాలు మాత్రం ప్రెషర్ కుక్కర్ వండకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే.. అవి ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చిపెడతాయి. వంట అనేది ఒక కళ మాత్రమే కాదు.. సైన్స్‌కు సంబంధించినది కూడా. ఇవాళ మనం వంట చేయడం వెనుక ఉన్న సైన్స్ మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా సైన్స్ ప్రకారం ప్రెజర్ కుక్కర్‌లో ఎలాంటి ఆహారం వండకూడదతో ఓసారి తెలుసుకుందాం..
పచ్చని ఆకు కూరలు..
ఆకుకూరలు, బచ్చలికూర, పాలకూర, కొల్లార్డ్ గ్రీన్ వెజిటేబుల్స్‌లో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అది అధిక ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడు అందులో విషపూరిత నైట్రోసమైన్ స్థాయి పెరుగుతుంది. నైట్రేట్‌లు ఎక్కువగా ఉండటం వల్ల ప్రెజర్ కుక్కర్‌లో ఈ కూరగాయలను ఉడికించొద్దని నిపుణులు సూచిస్తారు. వేడి కారణంగా నైట్రోసమైన్‌ల స్థాయి పెరిగి, ఆరోగ్యానికి హానీ కలుగుతుంది.
రైస్..
బియ్యాన్ని ఉడికించడం ద్వారానే వండుతారు. అయితే, సరిగ్గా ఉడికించి తినకపోతే ఆరోగ్యానికి హానీ కలుగుతుంది. ప్రెజర్ కుక్కర్‌లో ఆహారం వండొద్దు. ఒకవేళ ఆహారాన్ని వండేటప్పుడు నీటి పరిమాణం, ఉడికించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
బీన్స్..
బీన్స్‌లో లెక్టిన్ ఉంటుంది. ఇది చాలా విషపూరితమైనది. సరిగ్గా ఉడికించకపోతే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. ఈ ఆహారం శరీరానికి ప్రమాదకరం. ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించి తినడం వలన కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి.
పాల ఉత్పత్తులు..
పాలు, పెరుగు, పనీర్ వంటివి తినే వస్తువులను పొరపాటున కూడా ప్రెజర్ కుక్కర్‌లో వండకూడదు. ఎందుకంటే అది పేలే ప్రమాదం ఉంది. అదే సమయంలో, ఇది దాని రుచిని కూడా చాలా వరకు ప్రభావితం చేస్తుంది.
పండ్లు..
యాపిల్, బేరిపండ్లను పొరపాటున ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించవద్దు. అలా చేస్తే.. అందులోని పోషకాలు పూర్తిగా పోతాయి. సాధారణ గిన్నెల్లో వీటిని ఉడికించడం ఉత్తమం.
ఈ మధ్య కాలంలో చాలా మంది ఈజీగా, త్వరగా అవుతుందనే ఉద్దేశ్యంతో ప్రతి ఆహారాన్ని ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించేస్తున్నారు. కానీ, ఇలా చేయడం వల్ల చాలా పోషక విలువలు కోల్పోతున్నారు. బదులుగా అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. పిల్లలకు తినిపిండం ఈజీగా అవుతుందని అన్న, పండ్లను ప్రెజర్ కుక్కర్లో ఉడికిస్తుంటారు. కానీ, ఇలా అస్సలు చేయొద్దు. వాటిలోని పోషకాలు కోల్పోయాక.. వాటిని పిల్లలకు తినిపించానా వృధానే అవుతుంది. అందుకని, వీలైనంత వరకు ప్రెజర్ కుక్కర్‌లో అన్ని రకాల ఆహారాలను ఉడికించడం మానుకోవడం ఉత్తమం. సమయం ఎక్కువైనా.. సాధారణ పద్ధతుల్లో ఉడికించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీ ఆరోగ్యం.. మీ చేతుల్లోనే ఉందని మాత్రం గ్రహించాల్సిన అవసరం ఉంది.
గమనిక: ఈ వ్యాసంలో పేర్కొన్న సమాచారం ప్రజల సాధారణ ప్రయోజనాలను ఉద్దేశించి ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..