Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Homeopathy: హోమియోపతి మందులు వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు..

వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే త్వరగా కోలుకుంటాం. లేదంటే.. ఇబ్బంది పడతాం. అందుకే చాలా మంది సమయాన్ని వృథా చేయకుండా అల్లోపతి వైద్యాన్ని ఎంచుకుంటారు. అల్లోపతి వైద్యం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. అయితే, అల్లోపతి వైద్యంలో వ్యాధి మూలాల నుంచి నిర్మూలన జరుగదు. మళ్లీ కొద్ది కాలానికి తిరిగి వస్తుంది. పదే పదే ఇలా రావడం వల్ల అసలు మెడిసిన్స్ పని చేస్తున్నాయా?

Homeopathy: హోమియోపతి మందులు వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు..
Homeopathy
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 05, 2023 | 8:45 AM

చాలామంది రోగాలు, వ్యాధుల బారిన పడిన వారు చికిత్స కోసం అల్లోపతి మందుల కంటే హోమియోపతి మందులనే ఎక్కువగా తీసుకుంటారు. ఈ రన్ ఆఫ్ ది మిల్ జీవనశైలి, జంక్ ఫుడ్స్ కారణంగా అనారోగ్యానికి గురవ్వాల్సి వస్తుంది. అయితే, వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే త్వరగా కోలుకుంటాం. లేదంటే.. ఇబ్బంది పడతాం. అందుకే చాలా మంది సమయాన్ని వృథా చేయకుండా అల్లోపతి వైద్యాన్ని ఎంచుకుంటారు. అల్లోపతి వైద్యం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. అయితే, అల్లోపతి వైద్యంలో వ్యాధి మూలాల నుంచి నిర్మూలన జరుగదు. మళ్లీ కొద్ది కాలానికి తిరిగి వస్తుంది. పదే పదే ఇలా రావడం వల్ల అసలు మెడిసిన్స్ పని చేస్తున్నాయా? లేదా? అనే అనుమానం కలుగుతుంది. దాంతో కొందరు హోమియోపతిని ఆశ్రయిస్తున్నారు.

హోమియోపతి ద్వారా సమస్య తగ్గడానికి కొంత సమయం పట్టొచ్చు కానీ, వ్యాధిని పూర్తిగా మూలాల నుంచి నిర్మూలిస్తుంది. అల్లోపతిలో కూడా తగ్గని కొన్ని వ్యాధులు హోమియోపతిలో తగ్గడం విశేషం. అయితే, ఇందుకు నియమాలు సరిగ్గా పాటించాల్సి ఉంటుంది. అలా చేస్తే ఈ ఔషధం వెంటనే ప్రభావం చూపుతుంది. మద్యపానం, గుట్కా, ధూమపానం చేయని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించే వ్యక్తులపై హోమియోపతి ప్రభావం త్వరగా కనిపిస్తుంది. దీని ఫలితం కూడా మంచిగా వస్తుంది. అయితే, హోమియోపతి మెడిసిన్స్ వాడేవారు తప్పకుండా కొన్ని నియామాలు పాటించాలి. వాటిని పాటిస్తేనే ప్రయోజనం ఉంటుంది. లేదంటే.. ఆ మెడిసిన్స్ ఎన్ని వాడినా ఉపయోగం ఉండదు.

హోమియోపతి మెడిసిన్స్ వాడేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

1. ఈ ఔషధం తీసుకున్న తరువాత కంటైనర్లు గట్టిగా మూసివేయాలి.

2. హోమియోపతి వైద్యాన్ని అలాగే కంటిన్యూ చేయాలి.

3. బలమైన సూర్యకాంతి ఉన్నచోట ఔషధాన్ని ఉంచవద్దు.

4. ఎప్పుడూ చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి. వేడి ప్రదేశంలో ఉంచితే దాని ప్రభావం తగ్గిపోతుంది.

5. ఎలక్ట్రానిక్ పరికరాలకు దరంగా ఉంచాలి.

6. మెడిసిన్ బాటిల్ మూతను ఎప్పుడూ తెరిచి ఉంచొద్దు.

7. హోమియోపతి మందులను ఎప్పుడూ చేతిలోకి తీసుకుని వేసుకోవద్దు. మూత ద్వారా మాత్రమే నోట్లో వేసుకోవాలి.

8. ఔషధం తీసుకున్న 10 నిమిషాల వరకు ఏమీ తినొద్దు, తాగొద్దు.

9. హోమియోపతి మందులు తీసుకుంటే కాఫీ, టీ తాగొద్దు.

10. పుల్లటి ఆహారాలు తినొద్దు.

గమనిక: ఆయుర్వేద వైద్యులు తెలిపిన సమాచారం మేరకు ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏమైనా సందేహాలుంటే ముందుగా వైద్యులను సంప్రదించి, వారి సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లి్క్ చేయండి..