IRCTC: మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా? అయితే, ముందు ఇది చెక్ చేసుకోండి.. లేదంటే మొత్తం గుంజేస్తారు..!
మోసగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ప్రజల అవసరాలే.. వీరి ఆసరాగా మార్చేసుకుంటున్నారు. ప్రజలను ట్రాప్ చేయడానికి IRCTC నకిలీ అప్లికేషన్‌లను సృష్టించారు. ఇలాంటి నకిలీ మొబైల్ యాప్‌ల గురించి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది. IRCTC ఈ విషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రజలను జాగ్రత్తగా ఉండాలని కోరింది.
రైలు ప్రయాణం చేస్తున్నారా? ట్రైన్ టికెన్‌ను మీ మొబైల్ నుంచే బుక్ చేసుకుంటున్నారా? అయితే, తస్మాత్ జాగ్రత్త. స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా రైలు టిక్కెట్లను బుక్ చేసుకుంటే, మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మోసగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ప్రజల అవసరాలే.. వీరి ఆసరాగా మార్చేసుకుంటున్నారు. ప్రజలను ట్రాప్ చేయడానికి IRCTC నకిలీ అప్లికేషన్‌లను సృష్టించారు. ఇలాంటి నకిలీ మొబైల్ యాప్‌ల గురించి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది. IRCTC ఈ విషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రజలను జాగ్రత్తగా ఉండాలని కోరింది.
రైల్వే టికెట్ బుకింగ్ విషయంలో మొబైల్ అప్లికేషన్‌కు సంబంధించి ఓ మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతోంది. సైబర్ నేరగాళ్లు ప్రజలకు ఫిషింగ్ లింక్‌లను పంపి నకిలీ IRCTC యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. దానిని డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ప్రజలు మోసపోయే ప్రమాదం ఉంది. అందుకే, ఇలాంటి లింక్స్, యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఐఆర్‌సీటీసీ ప్రజలను హెచ్చరించింది.
IRCTC సూచనలు..
Android వినియోగదారులు Google Play Store, Apple iPhone వినియోగదారులు App Storeని సందర్శించడం ద్వారా మాత్రమే IRCTC అధికారిక మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని రైల్వే అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఎవరైనా మీకు లింక్ పంపి, రైల్ కనెక్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని అడిగితే, ఆ లింక్ తెరవకుండానే వాటిని బ్లాక్ చేయాలని సూచించారు.
సైబర్ నేరగాళ్లు ఫేక్ ఆండ్రాయిడ్ యాప్, వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసినట్లు నెలరోజుల క్రితం IRCTC ప్రజలను హెచ్చరించింది. ఈ నకిలీ యాప్, సైట్ ద్వారా వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు చోరీ చేస్తున్నారని వార్నింగ్ ఇచ్చింది. ఈ నకిలీ యాప్ పేరు APK, irctcconnect.apkగా తెలిపింది. ఈ apk లింక్ వాట్సాప్, టెలిగ్రామ్‌లలో పంపుతున్నారు కేటుగాళ్లు.
స్కామర్లు ఏం చేస్తారు?
నకిలీ యాప్‌లు, సైట్‌లను సృష్టించి మీ బ్యాంకింగ్ వివరాలు, యూపీఐ వివరాలు, బ్యాంక్ కార్డ్ వివరాలకు సంబంధించిన సమాచారాన్ని మోసగాళ్లు దొంగిలిస్తారు. అప్పుడు వారు మీ బ్యాంకు ఖాతా నుండి మీరు సంపాదించిన డబ్బునంతా దొంగిలిస్తారు. అందుకే ఈ మోసగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండండి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..