- Telugu News Photo Gallery Cinema photos From Puneeth Rajkumar to Spandana these are the celebrities who died of heart attack
Celebrities Died of Heart Attack: గుండెపోటుతో హఠన్మరణం చెందిన సినీ సెలబ్రెటీలు వీరే..
ఇటీవల కాలంలో సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు అతిచిన్న వయసులోనే గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్‌తో మరణిస్తున్నారు. గుండె హఠాత్తుగా ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోవడం వల్ల ఈ ఆకస్మికమరణాలు సంభవిస్తున్నాయి. ఇక సినీసెలట్రెటీలు వయసు పైబడుతున్నా అదే గ్లామర్‌ను మెయింటైన్ చేయాలనే తాపత్రయంతో మితిమీరి వర్కౌట్లు చేసి 40 ఏళ్లు కూడా నిండకుండానే గుండెపోటుతో మృతి చెందుతున్నారు. ఇటీవల వరుసగా సెలబ్రిటీలు గుండెపోటుతో ఆకస్మకంగా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా సిద్దార్థ్ శుక్లా నుంచి స్పందన వరకు..
Updated on: Aug 08, 2023 | 1:46 PM

ఇటీవల కాలంలో సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు అతిచిన్న వయసులోనే గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్‌తో మరణిస్తున్నారు. గుండె హఠాత్తుగా ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోవడం వల్ల ఈ ఆకస్మికమరణాలు సంభవిస్తున్నాయి. ఇక సినీసెలట్రెటీలు వయసు పైబడుతున్నా అదే గ్లామర్‌ను మెయింటైన్ చేయాలనే తాపత్రయంతో మితిమీరి వర్కౌట్లు చేసి 40 ఏళ్లు కూడా నిండకుండానే గుండెపోటుతో మృతి చెందుతున్నారు. ఇటీవల వరుసగా సెలబ్రిటీలు గుండెపోటుతో ఆకస్మకంగా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా సిద్దార్థ్ శుక్లా నుంచి స్పందన వరకు గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలు వీరే..

హిందీ ‘బిగ్ బాస్’ సీజన్ 13 విజేత, ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ నటుడు సిద్ధార్థ్ శుక్లా (40) గుండెపోటుతో కన్నుమూశారు. కేవలం 40 ఏళ్లు మాత్రమే. నిత్యం వ్యాయాయం చేస్తూ ఎంతో ఆరోగ్యకరమైన డైట్‌ను ఫాలో అయ్యే సిద్ధార్థ్ శుక్లా దురదృష్టం కొద్దీ ఆకస్మికంగా గుండెపోటుతో కన్నుమూశాడు.

2021లో ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ (46) గుండెపోటుతోనే హఠార్మణం చెందారు. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ హార్ట్‌ఎటాక్‌కు గురయ్యారు. పునీత్ మరణ వార్తను ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

మరో కన్నడ నటుడు చిరంజీవి సర్జా (35) అతిచిన్న వయసులోనే గుండెపోటుతో మరణించారు. యాక్షన్ కింగ్ అర్జున్‌కు ఆయన స్వయానా మేనల్లుడు. 2009లో వాయుపుత్ర మువీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి సర్జా సుమారు 19 సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ యంగ్ హీరో నందమూరి తారకరత్న (39) గుండెపోటుతో అకాల మరణం చెందారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో సుమారు 23రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఫిబ్రవరి 18న కన్నుమూశాడు.

కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మరణించింది. బ్యాంకాక్ ట్రిప్‌లో ఉన్న స్పందన గుండెపోటుతో కుప్పకూలిపోయింది. ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. కాగా దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి విజయ్ రాఘవేంద్ర దగ్గర బంధువు కావడం మరో విశేషం. శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో వరుస మరణాలు తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.





























