Yukti Thareja: కిర్రాక్ స్టిల్స్ తో కవ్విస్తున్న యంగ్ బ్యూటీ.. యుక్తి తరేజా లేటెస్ట్ పిక్స్
టాలీవుడ్ లోకి మరో కొత్త బ్యూటీ వచ్చింది. అందం, అభినయంతో కట్టిపడేసేందుకు సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ.. ఆమె ఎవరో కాదు యుక్తి తరేజా. నాగశౌర్య హీరోగా నటించిన ‘రంగబలి’ మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది బాలీవుడ్ బ్యూటీ యుక్తి తరేజా. యుక్తి తరేజా హర్యానాకు లోని కర్నాల్ లో జన్మించింది. ఈమె ఢిల్లీ లో ఓ విశ్వవిద్యాలయంలో డిగ్రీ (కామర్స్) చదివింది ఈ చిన్నది.
Phani CH |
Updated on: Aug 08, 2023 | 9:57 PM

టాలీవుడ్ లోకి మరో కొత్త బ్యూటీ వచ్చింది. అందం, అభినయంతో కట్టిపడేసేందుకు సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ.. ఆమె ఎవరో కాదు యుక్తి తరేజా.

నాగశౌర్య హీరోగా నటించిన ‘రంగబలి’ మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది బాలీవుడ్ బ్యూటీ యుక్తి తరేజా.

యుక్తి తరేజా హర్యానాకు లోని కర్నాల్ లో జన్మించింది. ఈమె ఢిల్లీ లో ఓ విశ్వవిద్యాలయంలో డిగ్రీ (కామర్స్) చదివింది ఈ చిన్నది.

ఆ యూనివర్సిటీలో చదవడం వల్ల ఆమె జీవితం మలుపు తిరిగింది. అక్కడ డాన్స్ పోటీలు, ప్రదర్శనల్లో పాల్గొంటూ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

2019 లో జరిగిన ‘ఎంటీవీ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్’ పోటీల్లో పాల్గొంది యుక్తి తరేజా.

2021 లో వచ్చిన ఇమ్రాన్ హష్మీతో కలిసి చేసిన ‘లుట్ గయే’ పాటతో బాగా పాపులర్ అయింది యుక్తి తరేజా. ఈ పాట వల్లే ‘రంగబలి’లో నటించే అవకాశం అందుకుంది.

మాతృభాష హిందీకావడం వల్ల తెలుగులో నటించేటప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నదట.. కానీ ఆ విషయంలో దర్శకత్వ బృందం సాయం చేసిందని తెలిపింది.

యుక్తికి హీరో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమట అలానే ఆయనతో కలిసి డ్యాన్స్ చేయాలని ఉందట ఈ ముద్దుగుమ్మకు. అలానే హీరోయిన్స్‌లో అనుష్క అంటే అభిమానం అని తెలిపింది.

యుక్తి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.





























