Andhra Pradesh: విశాఖ యూత్‌ను అట్రాక్ట్ చేస్నున్న న్యూ లొకేషన్.. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌ను తలదన్నేలా..

టాక్టికల్ అర్బనైజేషన్ పేరుతో చాలా వ్యూహాత్మకంగా నిర్మించిన ఈ వైజాగ్ చుట్టూ ఇప్పుడు ట్రాఫిక్ సమస్య పెద్ద సమస్యగా మారింది. నగరంలో కీలకమైన జంక్షన్ కావడం, నిరంతరం వందల సంఖ్యలో వాహనాలు ఆ ప్రదేశంలో మూమెంట్ ఇస్తూ ఉండడం వల్ల పాదాచార్యులు ఆ ప్రాంతంలో కాసింత విరామానికి ఆగినప్పటికీ ట్రాఫిక్ రణగుణల మధ్య ఉపశమనం పొందడం వీలు కాదని అలాంటి ప్రాంతంలో ఇలాంటి స్ట్రీట్లను సృష్టిస్తే పెను ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయన్నది సగటు నగర పౌరుని అభ్యంతరం.

Andhra Pradesh: విశాఖ యూత్‌ను అట్రాక్ట్ చేస్నున్న న్యూ లొకేషన్.. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌ను తలదన్నేలా..
Vizag Square
Follow us
Eswar Chennupalli

| Edited By: Jyothi Gadda

Updated on: Aug 09, 2023 | 11:19 AM

సిటీ ఆఫ్ డెస్టినీ లో సరికొత్త డెస్టినేషన్ సిద్దమైంది. నగరం నడిబొడ్డున దత్ ఐలాండ్ వద్ద ఏర్పాటైన వైజాగ్ స్క్వేర్ ఇప్పుడు టాక్ ఆఫ్ సిటీ. వ్యూహాత్మక పట్టణీకరణ లో భాగంగా పాదచారుల కు కాసింత ఉపశమనాన్ని కలిగించేందుకు అద్భుతమైన పెయింట్లు వేసి యురోపియన్ స్టైల్ లో సరికొత్త స్ట్రీట్ ను సృష్టించింది నగర పాలక సంస్థ జీ వి ఎం సీ. ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఈ వైజాగ్ స్క్వేర్ ను న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ తో పోలుస్తూ సోషల్ మీడియా లో హల్ చల్ సృష్టిస్తోంది వైజాగ్ స్క్వేర్.

“టాక్టికల్ అర్బనిజం”‘ అనే కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నగరం నడిబొడ్డున పాదచారుల కోసం ప్రత్యేక స్థలాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్తించింది. సామాజిక ఐక్యతను ప్రోత్సహించే లక్ష్యంతో సివిక్ చీఫ్ తీసుకున్న ఈ వినూత్న చొరవ పై ప్రస్తుతం మిశ్రమ స్పందన వస్తోంది

విశాఖ హార్ట్ ఆఫ్ ద సిటీ లోని సిరిపురం జంక్షన్ లో ఉన్న దత్ ఐలాండ్ నుంచి సంపత్ వినాయక్ టెంపుల్ వెళ్ళే మార్గంలో ఒక 100 మీటర్ల స్థలాన్ని గతంలోనే ఖాళీ చేయించి పెద్దగా ఉపయోగం లోకి లేకుండా రిజర్వ్ చేశారు. ఇప్పుడు ఆ స్థలాన్ని టాక్టికల్ పట్టణీకరణ లో భాగంగా యురోపియన్ స్టైల్ లో ఒక వాక్ స్ట్రీట్ ను తయారు చేయించింది జీ వి ఎం సీ అద్భుతమైన కళాకారులచే పెయింట్ చేయబడి ఆ ప్రాంతంలో కొంత మౌలిక సదుపాయాల ను కల్పించి అక్కడ వైజాగ్ స్క్వేర్ అని పెట్టడం తో ఇప్పుడు అది నగర సంచలనం గా మారింది.

ఇవి కూడా చదవండి

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లానే వైజాగ్ స్క్వేర్..

ఈ టాక్టికల్ ఆర్బనైజేషన్ కు క్లాసికల్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్. అది కూడా పూర్తిగా పాదచారులకు మాత్రమే కేటాయించిన అద్భుతమైన ప్రాంతం. ప్రపంచవ్యాప్తంగా టైమ్స్ స్క్వేర్ కు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో అందరికీ తెలిసిందే . యూ ఎస్ ను సందర్శించిన ఎవరైనా టైమ్స్ స్క్వేర్ సందర్శించకుండా రావడం అసాధ్యం. అలానే విశాఖ వచ్చిన వాల్లెవరైనా ఇకపై వైజాగ్ స్క్వేర్ ను సందర్శించకుండా వెళ్ళలేరు అన్నది నిర్విదాంశం.

Vizag Square 1

Vizag Square

సామాజిక ఐక్యతను ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకున్న ఈ వినూత్న చొరవ ప్రాంతంలో అనేక ఫుడ్ జోన్‌లు, కాఫీ షాపులు మరియు షాపింగ్ ఎవెన్యూలు ఉన్నందున పెద్ద సంఖ్యలో ప్రజలు దత్ ఐలాండ్ ను సందర్శిస్తారని, ఈ ఆలోచనను అమలు చేయడానికి ఇది అనువైన ప్రదేశం అని టీవీ9 తో అన్నారు జీ వి ఎం సి కమిషనర్ సాయి కాంత్ వర్మ. కూర్చోవడానికి టైర్లు, డాబా లాంటి ఫర్నిచర్‌ను కూడా ఏర్పాటు చేసిన అధికారులు ప్రజలు సానుకూలంగా ఆహ్వానిస్తే నగరంలో ఇలాంటి మరిన్ని ఖాళీ స్థలాల్లో ఇలాంటివి ఏర్పాటు చేస్తాం’ అంటున్నారు జీవీఎంసీ కమిషనర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ తెలిపారు

వైజాగ్ స్క్వేర్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలు..

టాక్టికల్ అర్బనైజేషన్ పేరుతో చాలా వ్యూహాత్మకంగా నిర్మించిన ఈ వైజాగ్ చుట్టూ ఇప్పుడు ట్రాఫిక్ సమస్య పెద్ద సమస్యగా మారింది. నగరంలో కీలకమైన జంక్షన్ కావడం, నిరంతరం వందల సంఖ్యలో వాహనాలు ఆ ప్రదేశంలో మూమెంట్ ఇస్తూ ఉండడం వల్ల పాదాచార్యులు ఆ ప్రాంతంలో కాసింత విరామానికి ఆగినప్పటికీ ట్రాఫిక్ రణగుణల మధ్య ఉపశమనం పొందడం వీలు కాదని అలాంటి ప్రాంతంలో ఇలాంటి స్ట్రీట్లను సృష్టిస్తే పెను ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయన్నది సగటు నగర పౌరుని అభ్యంతరం. దీంతో ఒకవైపు దాన్ని ఆహ్వానిస్తూనే మరోవైపు ట్రాఫిక్ సమస్య ను దృష్టిలో ఉంచుకుని సందేహంలో పడ్డారు నగర వాసులు. దీంతో ప్రస్తుతం దాని ప్రారంభోత్సవాన్ని ఆపేసి దాని ప్రభావం ట్రాఫిక్ పై ఏ మేర పడనుందో అబ్జర్వ్ చేసే పనిలో పడ్డారు జీవిఎంసి, ట్రాఫిక్ అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..