Chittoor: కడప సెంట్రల్ జైలుకు క్యూ కడుతున్న చిత్తూరు టీడీపీ కేడర్.. ఇప్పటికే 11 కేసుల్లో 84 మంది..
టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా టూర్ ఆ పార్టీ నేతలకు కేసుల భయాన్ని మిగిల్చింది. పుంగనూరు, మొలకల చెరువు సర్కిల్‌లో ఇప్పటి దాకా 11 కేసులు నమోదు చేసిన పోలీసులు 84 మందిని అరెస్ట్ చేసారు. కేసులతో చిత్తూరు జిల్లా టీడీపీ ముఖ్య నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోగా అరెస్టుల పర్వం కొనసాగు తుండగా గ్రామాల్లో టిడిపి నేతల ఇళ్లకు తాళాలు పడుతున్నాయి. ఇళ్లకు దూరమై చాలా మంది ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటుడగా అరెస్టయిన టీడీపీ కేడర్ కడప సెంట్రల్ జైలుకు క్యూ కడుతోంది

టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా టూర్ ఆ పార్టీ నేతలకు కేసుల భయాన్ని మిగిల్చింది. పుంగనూరు, మొలకల చెరువు సర్కిల్‌లో ఇప్పటి దాకా 11 కేసులు నమోదు చేసిన పోలీసులు 84 మందిని అరెస్ట్ చేసారు. కేసులతో చిత్తూరు జిల్లా టీడీపీ ముఖ్య నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోగా అరెస్టుల పర్వం కొనసాగు తుండగా గ్రామాల్లో టిడిపి నేతల ఇళ్లకు తాళాలు పడుతున్నాయి. ఇళ్లకు దూరమై చాలా మంది ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటుడగా అరెస్టయిన టీడీపీ కేడర్ కడప సెంట్రల్ జైలుకు క్యూ కడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో ఆ పార్టీ క్యాడర్ ఇప్పుడు పోలీసులు కేసులతో వణికి పోతుంది. చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు పరిశీలన పేరుతో రెండు రోజులపాటు సాగిన చంద్రబాబు పర్యటన ముగిసిన రోజు నుంచి జిల్లా లోని ముఖ్య నేతల నుంచి సామాన్య కార్యకర్త దాకా పోలీసుల కేసుల భయం వెంటాడుతోంది. మొలకలు చెరువు నుంచి పుంగనూరు వరకు సాగిన దాడులు, ఘటనలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు ఇప్పటికే 11 కేసులు నమోదు చేసి 84 మందిని అరెస్ట్ చూపారు. అరెస్ట్ అయిన వారందరిని రిమాండ్ కోసం కడప సెంట్రల్ జైలుకు తరలిస్తున్న జిల్లా పోలీసులు మరిన్ని కేసులు నమోదు చేస్తారన్న భయంతో టిడిపి కేడర్ భయపడుతోంది. పోలీసులపై కర్రలు, రాళ్ళతో దాడి జరిగిన ఘటన తోపాటు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టడంపై కేసులు నమోదు చేసిన పోలీసు యంత్రాంగం 50 మంది పోలీసులు గాయపడినట్లు చెబుతోంది. పుంగనూరు టిడిపి ఇన్ ఛార్జ్ చల్లాబాబు పి.ఏ. గోవర్ధన్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా A 1 గా చల్లాబాబు పేరు తో కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం పుంగనూరు పిఎస్ లో ఏడు కేసుల్లో 74 మందిని ఇప్పటిదాకా అరెస్ట్ చేశారు. టెక్నికల్ ఆధారాలతోనే పోలీసులపై దాడి చేసి హింసకు కారకులైన వారిని పోలీస్ యంత్రాంగం గుర్తించే పనిలో ఉంది.
అజ్ఞాతంలో చల్లా బాబు..
మరోవైపు చిత్తూరు జిల్లా టీడీపీ ముఖ్యనేతలకు కూడా ఈ కేసులు ఉచ్చు బిగిస్తున్నాయి. పుంగనూరు దాడి కేసు లో అన్నింటిలోనూ A1 గా ఉన్న చల్లాబాబు చంద్రబాబు పర్యటన ముగిసిన మరుక్షణమే అజ్ఞాతంలోకి వెళ్లిపోగా పుంగనూరు పీఎస్ లో మొత్తం 7 కేసుల్లో 74 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక ముదివేడు పీఎస్ లో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, గంటా నరహరి, చిన్న బాబు తో పాటు మరి కొందరిపై కేసు నమోదు నమోదు అయ్యాయి. రాజంపేట పార్లమెంటు టిడిపి అభ్యర్థి గంటానరహరి వాహనంలో గన్, డబ్బు, మద్యం గుర్తించిన పోలీసులు ఈమేరకు గంట నరహరి కి చెందిన KA05 NF4666 ఫార్చునర్ వెహికల్ ను సీజ్ చేశారు. కారులో డబుల్ బ్యారెల్ గన్, 8 క్యాట్రిజెస్ ఉన్న పౌచ్ స్వాదీనం చేసుకున్న పోలీసులు సూట్ కేస్ లో రూ. 1.5 లక్ష నగదు, 3 లిక్కర్ బాటిల్స్, టిడిపి కండువాలు గుర్తించారు. కారు డ్రైవర్ గుర్మిత్ సింగ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఐపిసి 120B, 307, 341, 352, 336, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల తోపాటు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ముదివేడు, మొలకల చెరువు పిఎస్ లో మొత్తం 4 కేసులు పెట్టి 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇక పోలీసుల కేసు నమోదు వ్యవహారం కొనసాగుతుండటంతో టిడిపి హై కమాండ్ కమిటీని నియమించింది. మాజీ మంత్రులు సోమిరెడ్డి కాలువ శ్రీనివాసులు తోపాటు పలువురు ముఖ్య నేతల కమిటీ ఘటనల్లో గాయపడి ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్న పార్టీ కేడర్ ను పరామర్శిస్తుంది. అరెస్ట్ అయిన వారి బెయిల్ కోసం ప్రయత్నిస్తుంది. చంద్రబాబు సొంత జిల్లాలోని పార్టీ కేడర్ లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్న హైకమాండ్ ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిన టిడిపి ముఖ్య నేతల బెయిల్ కోసం ప్రయత్నిస్తోంది.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..