OTT: బలగం తర్వాత మరో తెలంగాణ పల్లె కథ.. ఓటీటీలోకి వచ్చేసిన ‘భీమదేవరపల్లి బ్రాంచీ’.. ఎక్కడ చూడొచ్చంటే?

టాలీవుడ్‌లో ఈ మధ్యన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా తీస్తున్న సినిమాలు బాగా పెరిగాయి. జబర్దస్త్‌ కమెడియన్‌ వేణు బలగం, ఆతర్వాత నాని దసరా, ఈ మధ్యనే వచ్చినే మేమ్‌ ఫేమస్‌, పరేషాన్‌ సినిమాలన్నీ తెలంగాణ కల్చర్‌ బేస్డ్‌ సినిమాలే. ప్రేక్షకులు కూడా ఈ సినిమాలకు బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇదే కోవలో తెరకెక్కిన చిత్రం భీమదేవరపల్లి బ్రాంచీ.

OTT: బలగం తర్వాత మరో తెలంగాణ పల్లె కథ.. ఓటీటీలోకి వచ్చేసిన 'భీమదేవరపల్లి బ్రాంచీ'.. ఎక్కడ చూడొచ్చంటే?
Bheemadevarapally Branchi Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 08, 2023 | 6:30 AM

టాలీవుడ్‌లో ఈ మధ్యన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా తీస్తున్న సినిమాలు బాగా పెరిగాయి. జబర్దస్త్‌ కమెడియన్‌ వేణు బలగం, ఆతర్వాత నాని దసరా, ఈ మధ్యనే వచ్చినే మేమ్‌ ఫేమస్‌, పరేషాన్‌ సినిమాలన్నీ తెలంగాణ కల్చర్‌ బేస్డ్‌ సినిమాలే. ప్రేక్షకులు కూడా ఈ సినిమాలకు బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇదే కోవలో తెరకెక్కిన చిత్రం భీమదేవరపల్లి బ్రాంచీ. రమేష్ చెప్పల తెరకెక్కించిన ఈ మూవీలో అంజి వల్గుమాన్‌, సాయి ప్రసన్న, రాజవ్వ, బలగం సుధాకర్‌ రెడ్డి, గడ్డం నవీన్ కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటు సీబీఐ మాజీ జేడీ లక్ష‍్మీ నారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌ వంటి పలువురు రాజకీయ ప్రముఖులు అతిథి పాత్రల్లో మెరవడం విశేషం. జూన్‌ 23న థియేటర్లలో విడుదలైన భీమదేవరపల్లి బ్రాంచి సినిమా బాగానే ఆడింది. స్వచ్ఛమైన తెలంగాణ పల్లెటూరి కథ కావడంతో అందరూ ఈ మూవీకి కనెక్ట్‌ అయ్యారు. పైగా ఇందులో కనిపించేది అందరూ ఆర్గానిక్‌ నటీనటులే కావడంతో సినిమా ఎంతో రియాలిటీగా కనిపిస్తుంది. సుమారు రెండు గంటల పాటు తెలంగాణ పల్లె వాతావరణం మన కళ్ల ముందు కదలాడేలా ఎంతో సహజంగా ఈ మూవీని తెరకెక్కించాడు రమేష్‌. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన భీమదేవరపల్లి బ్రాంచీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈక్రమంలో సోమవారం (ఆగస్టు 7) రాత్రి నుంచే భీమదేవరపల్లి బ్రాంచీ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో అందబాటులోకి వచ్చేసింది.

అనుకోకుండా డబ్బులు అకౌంట్‌లో పడితే..

భీమదేవర పల్లి బ్రాంచీ సినిమా కథ విషయానికొస్తే.. తెలంగాణలోని భీమదేవరపల్లి అనే పల్లెటూరి ప్రజలు పూర్తిగా నిరక్షరాస్యులు. ఎవరైనా బాగా చదువుకున్నోడు ఏదైనా చెబితే ఇట్టే నమ్మేస్తారు. అలాంటి ఊరిలో ఉండే జంపన్న(అంజి వల్గుమాన్) ఖాతాలో అనుకోకుండా రూ.15 లక్షలు వచ్చి పడతాయి. ప్రభుత్వమే ఈ డబ్బులు ఇచ్చిందనుకోని అతను ఆ డబ్బులతో అప్పులు తీర్చేస్తాడు. జనాలందరూ కూడా అతనిని అనుసరించి బ్యాంక్‌ అకౌంట్లు తెరుస్తారు. మరి ఆ తర్వాత ఊరిలో జరిగే పర్యవసనాలేంటి? జంపన్నకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదే భీమదేవర పల్లి బ్రాంచీ సినిమా. మరి థియేటర్లలో దీనిని మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి మస్తుగా నవ్వుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?