AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: ఫ్రెండ్‌షిప్‌ ఫరెవర్‌.. పవన్‌ కల్యాణ్‌తో ఇంత చనువుగా ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బెస్ట్‌ ఫ్రెండ్స్‌ వీరే అంటూ కొందరి సినీ తారల ఫొటోస్‌ సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. రామ్ చరణ్‌- ఎన్టీఆర్‌, ప్రభాస్‌- గోపీచంద్‌, సాయి ధరమ్‌ తేజ్‌- మంచు మనోజ్‌.. ఇలా పలువురి ఫొటోస్‌ నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈక్రమంలోనే పవన్‌ కల్యాణ్‌కు సంబంధించిన ఒక ఫొటో అందరినీ ఆకట్టుకుంది. అందులో పవన్‌తో బాగా చనువుగా మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా?

Pawan Kalyan: ఫ్రెండ్‌షిప్‌ ఫరెవర్‌.. పవన్‌ కల్యాణ్‌తో ఇంత చనువుగా ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా?
Pawan Kalyan And His Friend
Basha Shek
|

Updated on: Aug 07, 2023 | 6:30 AM

Share

ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని అందరూ ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. తమ చిరకాల స్నేహితుందరినీ గుర్తు చేసుకుని విష్‌ చేశారు. అందుబాటులో లేని వారికి ఫోన్స్‌, వాట్సప్‌ల ద్వారా సందేశాలను పంపారు. అలాగే చాలామంది తమ ఫ్రెండ్స్‌ ఫొటోలను వాట్సప్‌ స్టేటస్‌లుగా పెట్టుకుని మరీ మురిసిపోయారు. ఇదే సందర్భంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బెస్ట్‌ ఫ్రెండ్స్‌ వీరే అంటూ కొందరి సినీ తారల ఫొటోస్‌ సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. రామ్ చరణ్‌- ఎన్టీఆర్‌, ప్రభాస్‌- గోపీచంద్‌, సాయి ధరమ్‌ తేజ్‌- మంచు మనోజ్‌.. ఇలా పలువురి ఫొటోస్‌ నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈక్రమంలోనే పవన్‌ కల్యాణ్‌కు సంబంధించిన ఒక ఫొటో అందరినీ ఆకట్టుకుంది. అందులో పవన్‌తో బాగా చనువుగా మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా? అతను కూడా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వాడే. గతంలో పవన్ కల్యాణ్‌ నటించిన సినిమాలకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ముఖ్యంగా తొలిప్రేమ సినిమాలో తాజ్‌ మహల్‌ సెట్‌ వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అప్పుడే పవన్, అతని మధ్య స్నేహం మొదలైంది. ఆ సినిమా విడుదలై పాతిక సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పటికీ వారిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ అలాగే కొనసాగుతోంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్‌.. అతను మరెవరో కాదు పవన్‌కు అత్యంత సన్నిహితులైన ఆనంద్‌ సాయి. తనను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది పవన్‌ కల్యాణేనని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఆనంద్‌ సాయి. తొలిప్రేమ సినిమాలోనే పవన్‌ చెల్లెలిగా నటించిన వాసుకీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారాయన.

ఉస్తాద్‌తో మళ్లీ..

సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆనంద్‌సాయి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయ పునరోద్ధరణ పనుల్లో ఆర్కిటెక్ట్‌గా కీలకంగా వ్యవహరించారు. . అలాగే రామానుజా చార్యులు విగ్రహ తయారీలో ప్రధాన రోల్‌ పోషించారు. అయితే పవన్‌ కల్యాణ్ కోరిక మేరకు మళ్లీ ఇప్పుడు సినిమాలు చేసేందుకు ఒప్పుకున్నారని తెలుస్తోంది. పవన్‌ నటిస్తోన్న హరిహర వీర మల్లు, ఉస్తాద్ భగత్‌ సింగ్‌ సినిమాలకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా ఆనంద్‌ సాయినే వ్యవహరిస్తున్నారు. కొన్నినెలల క్రితం ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఆ సందర్భంలో పవన్‌తో కలిసి ఎంతో సరదాగా ఫొటోలు కూడా దిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..