Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hidimba OTT: ఆహా ఓటీటీలోకి ‘హిడింబ’.. అశ్విన్‌ లేటెస్ట్‌ ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

యంగ్‌ హీరో అశ్విన్ బాబు నటించిన లేటెస్ట్‌ సినిమా హిడింబ. అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ మూవీలో నందిత శ్వేత కథానాయికగా నటించింది. ఏకే ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్‌ నిర్మించిన ఈ సినిమాను అనిల్‌ సుంకర సమర్పించారు. మే 28 న థియేటర్లలో విడుదలైన హిడింబ యావరేజ్‌గా నిలిచింది. న్యూ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది

Hidimba OTT: ఆహా ఓటీటీలోకి 'హిడింబ'.. అశ్విన్‌ లేటెస్ట్‌ ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Hidimba Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 10, 2023 | 3:41 AM

యంగ్‌ హీరో అశ్విన్ బాబు నటించిన లేటెస్ట్‌ సినిమా హిడింబ. అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ మూవీలో నందిత శ్వేత కథానాయికగా నటించింది. ఏకే ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్‌ నిర్మించిన ఈ సినిమాను అనిల్‌ సుంకర సమర్పించారు. జులై 20న థియేటర్లలో విడుదలైన హిడింబ యావరేజ్‌గా నిలిచింది. న్యూ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌కు కాస్త పీరియాడికల్‌ టచ్ ఇచ్చి తెరకెక్కించడం ఆడియెన్స్‌ను అట్రాక్ట్‌ చేసింది. ఇక హిడింబ సినిమాలో పోలీస్‌ కాప్‌గా నటించాడు అశ్విన్‌. ఎప్పటిలాగే తన నటనతో అదరగొట్టాడు. ఈ సినిమాతో యాక్షన్‌ హీరోగా తనను తాను ప్రూవ్‌ చేసుకున్నాడు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ హిడింబ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈక్రమంలో ఆగస్టు 10న సాయంత్ర 7 గంటల నుంచి అశ్విన్‌ సినిమా స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఈ మేరకు సోషల్‌ మీడియా ద్వారా అధికారిక ప్రకటన వెలువరించింది ఆహా.

హిడింబ సినిమాలో మకరంద్ దేశ్‌పాండే, రఘు కుంచె, శ్రీనివాసరెడ్డి, సంజయ్ స్వరూప్, రాజీవ్ కనకాల, షిజ్జు, రాజీవ్ పిళ్ళై, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వికాస్ బాడిస స్వరాలు సమకూర్చారు. కథ విషయానికొస్తే.. హైదరాబాద్ లో కొందరు మహిళలు వరుసగా కిడ్నాప్‌కు గురవుతారు. దీని వెనక గల గుట్టును కనిపెట్టడానికి స్పెషల్ ఆఫీసర్ ఆద్య (నందితా శ్వేత), ACP అభయ్ (అశ్విన్ బాబు) రంగంలోకి దిగితారు. ఇన్వెస్టిగేషన్‌లో వారికి రకరకాల అనుభవాలు ఎదురవుతాయి. మరి తప్పిపోయిన మహిళలకు ఏమైంది? ఈ నేరగాళ్లు ప్రత్యేకంగా మహిళలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆద్య, అభయ్ కిడ్నాప్ మిస్టరీని చేధించారా అన్నది తెలుసుకోవాలంటే హిడింబ సినిమాను చూడాల్సిందే. థియేటర్లలో ఈ సినిమాను మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..