Actress Poorna: కొడుకుని పరిచయం చేసిన హీరోయిన్‌ పూర్ణ.. ఎంత క్యూట్‌గా ఉన్నాడో చూశారా?

ఇటీవల స్టార్‌ సెలబ్రిటీలు తమ పిల్లల విషయంలో చాలా గోప్యత పాటిస్తున్నారు. తమ బిడ్డల ఫొటోలు, వీడియోస్‌ మీడియాలో కానీ సోషల్‌ మీడియాలో కానీ ఎక్కడా కనిపించకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చినప్పుడు కూడా తమ పిల్లల ఫొటోస్‌ తీయకుండా అడ్డుకుంటుంటారు. కేవలం సినిమా రంగానికి చెందని సెలబ్రిటీలే కాదు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు...

Actress Poorna: కొడుకుని పరిచయం చేసిన హీరోయిన్‌ పూర్ణ.. ఎంత క్యూట్‌గా ఉన్నాడో చూశారా?
Actress Poorna
Follow us
Basha Shek

|

Updated on: Aug 04, 2023 | 7:30 PM

ఇటీవల స్టార్‌ సెలబ్రిటీలు తమ పిల్లల విషయంలో చాలా గోప్యత పాటిస్తున్నారు. తమ బిడ్డల ఫొటోలు, వీడియోస్‌ మీడియాలో కానీ సోషల్‌ మీడియాలో కానీ ఎక్కడా కనిపించకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చినప్పుడు కూడా తమ పిల్లల ఫొటోస్‌ తీయకుండా అడ్డుకుంటుంటారు. కేవలం సినిమా రంగానికి చెందని సెలబ్రిటీలే కాదు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఇలాగే తమ పిల్లల పట్ల గోప్యతతో వ్యవహరిస్తున్నారు. అయితే ప్రముఖ హీరోయిన్‌ పూర్ణ మాత్రం త్వరగానే తన పిల్లాడిని ప్రపంచానికి పరిచయం చేసింది. తాజాగా ఓ పెళ్లి వేడుకకు హాజరైందామె. తన భర్త ఆసిఫ్ అలీతో పాటు కుమారుడితో కలిసి ఈ పెళ్లి వేడుకలో సందడి చేసింది పూర్ణ. అనంతరం పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అందులో తన కుమారుడు ఎంతో అందంగా, క్యూట్‌గా ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పేరుకు మలయాళీనే అయినా పక్కింటమ్మాయిగా తెలుగు ప్రేక్షకుల అభిమానం చూరగొంది పూర్ణ. శ్రీ మహాలక్ష్మి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె సీమ టపాకాయ్‌, అవును, అవును 2, జయమ్ము నిశ్చయమ్మురా, రాజుగారి గది, అఖండ తదితర హిట్ సినిమాల్లో నటించింది. చివరిగా న్యాచురల్‌ స్టార్ నాని నటించిన దసరా సినిమాలో కనిపించింది పూర్ణ.

ఇవి కూడా చదవండి

కాగా పెళ్లి విషయంలో ఎంతో గోప్యత పాటించింది పూర్ణ. మొదట నిశ్చితార్థం విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుందామె. దుబాయికి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో కలిసి ఉంగరాలు మార్చుకున్నట్లు తెలిపింది. అయితే ఆమె ఆతర్వాత పెళ్లిపై ఎలాంటి అప్డేట్‌ ఇవ్వలేదు. దీంతో పూర్ణ పెళ్లి ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. అయితే 2022 జూన్ 12న దుబాయిలోనే తన పెళ్లి అయిపోయినట్లు చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చింది. ఆ తర్వాత గర్భం దాల్చినట్లు శుభవార్త కూడా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో సీమంతం గ్రాండ్‌గా జరుపుకొంది. ఆ ఫొటోలను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి మురిసిపోయింది. ఇక తమ వైవాహిక దాంపత్యానికి గుర్తుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో హమ్దాన్ అసిఫ్ అలీ అనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది పూర్ణ.

పూర్ణ కుమారుడి ఫొటోస్, వీడియోలివే..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ