Prabhas: ప్రభాస్‌ సాయం చేయడంలో ముందుంటారు.. ఆయనే నాకు స్ఫూర్తి: డైరెక్టర్‌ మారుతి కూతురు

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలితో వరల్డ్‌ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారాయన. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్ లాంటి సినిమాలు చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోయినా డార్లింగ్‌ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. కాగా ప్రస్తుతం సలార్‌, కల్కి సినిమా షూటింగుల్లో బిజీబిజీగా ఉంటున్నాడు ప్రభాస్‌. అలాగే మారుతి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు.

Prabhas: ప్రభాస్‌ సాయం చేయడంలో ముందుంటారు.. ఆయనే నాకు స్ఫూర్తి: డైరెక్టర్‌ మారుతి కూతురు
Prabhas, Maruthi Daughter
Follow us
Basha Shek

|

Updated on: Aug 02, 2023 | 8:54 PM

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలితో వరల్డ్‌ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారాయన. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్ లాంటి సినిమాలు చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోయినా డార్లింగ్‌ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. కాగా ప్రస్తుతం సలార్‌, కల్కి సినిమా షూటింగుల్లో బిజీబిజీగా ఉంటున్నాడు ప్రభాస్‌. అలాగే మారుతి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ప్రభాస్‌ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు భిన్నంగా మారుతి సినిమా అంటుందని తెలుస్తోంది. సూపర్ నేచురల్ హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉండబోతుందని సమాచారం. అందుకు తగ్గట్టుగానే కొన్ని రోజుల క్రితం మారుతి- ప్రభాస్‌ షూట్‌లో కలిసున్న ఒక ఫొటో లీక్‌ అయ్యింది. అందులో డార్లింగ్ లుక్‌ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. ఈ మూవీకి రాజా డీలక్స్‌, అంబాసిడర్‌ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. అయితే ప్రభాస్‌- మారుతిల సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ మూవీ అప్డేట్ కోసం డార్లింగ్‌ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే ప్రభాస్‌ గురించి డైరెక్టర్‌ మారుతి కూతురు హియా దాసరి మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘ప్రభాస్ చాలా మంచివారు. హుందాగా, గర్వం లేకుండా, ఎంతో వినయంగా ఉంటారు. ఆయన నుంచి నేర్చుకోవాలి. ప్రభాస్‌కి ఫుడ్ అంటే ఇష్టం. నాక్కూడా ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇక సెట్‌ లో ప్రభాస్ అందరికీ ప్రేమగా ఫుడ్ పెడతారు. ఎదుటి వారికి సాయం చేయడంలో ముందుంటారు. ఆయనే నాకు స్ఫూర్తి’ అని ప్రభాస్‌ గురించి గొప్పగా చెప్పుకొచ్చింది హియా దాసరి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. తమ హీరో గురించి హియా చాలా బాగా మాట్లాడిందంటూ డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఈ వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు. కాగా మారుతి కూతురు హియా దాసరికి పెయింటింగ్స్‌లో మంచి ప్రావీణ్యముంది. ఇటీవల ఓ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటుచేసింది. అల్లు అరవింద్‌ వంటి సినీ ప్రముఖులు ఈ ఎగ్జిబిషన్‌కు వచ్చేసి హియా ట్యాలెంట్‌ను మెచ్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!