- Telugu News Photo Gallery Cinema photos Tamannah Interesting Comments about Bhola Shankar and Jailer Movie telugu cinema news
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ కల నెరవేరింది.. ఆ ఇద్దరు హీరోలతో వర్క్ చేయడంపై తమన్నా సంతోషం..
మెగా అభిమానుల మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ భోళా శంకర్. మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వస్తోన్న ఈ సినిమాకు స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ లో తమన్నా కథానాయికగా నటించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ ల క్రేజీ ప్రాజెక్ట్ 'జైలర్' కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు మిల్కీబ్యూటీ. తాజాగా ఇద్దరు స్టార్స్ తో కలిసి నటించిన తన అనుభవాన్ని పంచుకున్నారు తమన్నా.
Updated on: Aug 04, 2023 | 7:20 PM

మెగా అభిమానుల మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ భోళా శంకర్. మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వస్తోన్న ఈ సినిమాకు స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ లో తమన్నా కథానాయికగా నటించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ ల క్రేజీ ప్రాజెక్ట్ 'జైలర్' కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు మిల్కీబ్యూటీ. తాజాగా ఇద్దరు స్టార్స్ తో కలిసి నటించిన తన అనుభవాన్ని పంచుకున్నారు తమన్నా

భోళా శంకర్, జైలర్ సినిమాలు ఒకే రోజు గ్యాప్ లో విడుదల కావడం సంతోషంగా ఉందని.. మెగాస్టార్, సూపర్ స్టార్.. ఇద్దరితో కలిసి నటించడంతో తన కల నెరవేరిందని చెప్పుకొచ్చింది.

చిరంజీవి గారితో డాన్స్ చేసే అవకాశం రావడం తన అదృష్టమని.. డాన్స్ లో ఇప్పుడు వాడుతున్న స్టైల్స్ ఆయన దగ్గర నుంచే వచ్చాయని అన్నారు. భోళా శంకర్ తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అన్నారు తమన్నా.

చిరంజీవి గారు, రామ్ చరణ్ ఇద్దరు అద్భుతమైన వ్యక్తులు అని.. చాలా సపోర్టివ్ గా ఉంటారని అన్నారు. తన కెరీర్ బిగినింగ్ నుంచి చాలా సపోర్టివ్ గా ఉన్నారని.. చరణ్, చిరంజీవి గారితో వర్క్ చేయడం మంచి అనుభవం అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.

తమిళంలో అరణం అనే సినిమా చేస్తున్నానని.. . మలయాళంలో తాను నటించిన బాంద్ర సినిమా విడుదలకు సిద్ధమౌతుందని అన్నారు. అలాగే హాట్ స్టార్ లో ఓ వెబ్ సిరిస్ చేస్తున్నట్లు తెలిపారు.

కీర్తి సురేష్ అత్యుత్తమ నటి అని... తను ఇంటెన్స్ సీన్స్ తో పాటు అన్నీ ఎమోషన్స్ ని సెటిల్డ్ అండ్ బ్యాలెన్సింగా చేస్తుందని అన్నారు. తనతో కలసి పని చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశానని.. . ఈ సినిమాతో మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం అని చెప్పుకొచ్చారు.




