Bhola Shankar: మరో వారం రోజుల్లో ‘భోళాశంకర్‌’ రిలీజ్‌.. మెగాస్టార్‌ మూవీ రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 'భోళా' మేనియా నడుస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన భోళాశంకర్‌ సినిమా మరో వారం రోజుల్లో రిలీజ్‌ కానుంది. దీంతో మెగాభిమానుల సందడి మాములుగా లేదు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలిగా నటిస్తుండగా, సుశాంత్ మరో కీలక పాత్రలో మెరవనున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న భోళాశంకర్‌

Bhola Shankar: మరో వారం రోజుల్లో 'భోళాశంకర్‌' రిలీజ్‌.. మెగాస్టార్‌ మూవీ రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?
Bhola Shankar Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 05, 2023 | 3:43 PM

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘భోళా’ మేనియా నడుస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన భోళాశంకర్‌ సినిమా మరో వారం రోజుల్లో రిలీజ్‌ కానుంది. దీంతో మెగాభిమానుల సందడి మాములుగా లేదు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలిగా నటిస్తుండగా, సుశాంత్ మరో కీలక పాత్రలో మెరవనున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న భోళాశంకర్‌ ఆగస్టు 11న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో స్పీడ్‌ పెంచారు మేకర్స్‌. ఇందులో భాగంగా భోళా శంకర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు కూడా ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఆగస్టు6న హైదరాబాద్‌లో మెగాస్టార్ మూవీ ఫంక్షన్‌ గ్రాండ్‌గా జరగనున్నట్లు తెలిపారు మేకర్స్‌. కాగా ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకున్న భోళా శంకర్‌ రన్‌ టైమ్‌ గురించి ఓ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సీబీఎఫ్‌సీ ప్రకారం సినిమా నిడివి 160 నిమిషాలు అంటే సుమారు 2 గంటల 40 నిమిషాలు ఉంటుందట. కోలీవుడ్‌ హిట్‌ మూవీ వేదాళంను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా భోళాశంకర్‌లో ఎన్నో మార్పులు ,చేర్పులు చేశాడట భోళాశంకర్‌.

భోళాశంకర్‌ సినిమాకు మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, పీ రవి శంకర్‌, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ మెగా మూవీని నిర్మిస్తున్నారు. టీజర్స్‌, ట్రైలర్స్‌ చూస్తుంటే గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యానికి సిస్టర్‌ సెంటిమెంట్‌ను జోడించి భోళాశంకర్‌ను ఆసక్తికరంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఆచార్య తర్వాత గాడ్‌ ఫాదర్‌, వాల్తేరు వీరయ్య విజయాలతో మంచి జోష్‌లో ఉన్నారు మెగాస్టార్. మరి ఇది కూడా సూపర్‌హిట్‌ అయ్యి మెగాస్టార్‌కు హ్యాట్రిక్‌ విజయాలను అందిస్తుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.