AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Scam 2003: ఓటీటీలోకి మరో సెన్సేషనల్‌ స్కామ్‌ స్టోరీ.. ‘స్కామ్‌ 2023’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ప్ర‌తీక్ గాంధీ కీ రోల్‌ పోషించిన స్కామ్‌ 1992 సిరీస్‌ ఐఎండీబీలో ఏకంగా 9.3 రేటింగ్స్‌తో ఇప్పటికీ అగ్రస్థానంలో ఉండడం విశేషం. కేవలం ఇండియాలోనే కాకుండా ప్ర‌పంచంలోని ఆల్‌టైమ్ పాపుల‌ర్ సిరీస్‌లలో ఒక‌టిగా స్కామ్‌ 1992 నిలిచింది. ఇంతటి ఆదరణ పొందిన ఈ సిరీస్‌కు కొనసాగింపుగా ఇప్పుడు 'స్కామ్ 2003.. ది తెల్గీ స్టోరీ' పేరుతో మరొక ఇంట్రెస్టింగ్‌ వెబ్‌ సిరీస్‌ రానుంది

Scam 2003: ఓటీటీలోకి మరో సెన్సేషనల్‌ స్కామ్‌ స్టోరీ.. 'స్కామ్‌ 2023' స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Scam 2003 The Telgi Story
Basha Shek
|

Updated on: Aug 05, 2023 | 4:58 PM

Share

సుమారు రెండున్నరేళ్ల క్రితం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీలీవ్‌లో వచ్చిన ‘స్కామ్‌ 1992’ ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన హర్షద్‌ మెహతా స్కామ్‌ ఆధారంగా హన్సల్‌ మెహతా ఈ సిరీస్‌ ను తెరకెక్కించారు. ప్ర‌తీక్ గాంధీ కీ రోల్‌ పోషించిన స్కామ్‌ 1992 సిరీస్‌ ఐఎండీబీలో ఏకంగా 9.3 రేటింగ్స్‌తో ఇప్పటికీ అగ్రస్థానంలో ఉండడం విశేషం. కేవలం ఇండియాలోనే కాకుండా ప్ర‌పంచంలోని ఆల్‌టైమ్ పాపుల‌ర్ సిరీస్‌లలో ఒక‌టిగా స్కామ్‌ 1992 నిలిచింది. ఇంతటి ఆదరణ పొందిన ఈ సిరీస్‌కు కొనసాగింపుగా ఇప్పుడు ‘స్కామ్ 2003.. ది తెల్గీ స్టోరీ’ పేరుతో మరొక ఇంట్రెస్టింగ్‌ వెబ్‌ సిరీస్‌ రానుంది. 2003లో దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన నకిలీ స్టాంప్‌ పేపర్ల కుంభకోణం ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ కేసులో శిక్షకు గురై జైలులోనే కన్నుమూసిన అబ్దుల్ కరీం తెల్గీ జీవితంలోని వాస్తవ ఘటనలను ఇందులో చూపించనున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న స్కామ్‌ 2023లో సెప్టెంబర్‌ 2 నుంచి సోనీలివ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.

కాగా 2003లో వెలుగు చూసిన నకిలీ స్టాంప్‌ పేపర్ల కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. ఇందులో దోషిగ తేలిన అబ్దుల్‌ కరీం తెల్గీ సుమారు రూ. 30వేల కోట్లు కూడబెట్టారని అంచనా. సంజయ్‌ సింగ్‌ అనే ప్రముఖ జర్నలిస్ట్‌ ఈ మోసాన్ని బయటపెట్టాడు. ఆయన రాసిన ‘రిపోర్టర్ కీ డైరీ’ ఆధారంగానే స్కామ్‌ 2023 తెరకెక్కింది. కర్ణాటకలోని ఖానాపూర్‌లో పండ్ల వ్యాపారం చేసే అబ్దుల్‌ కరీం ఎలా నకిలీ స్టాంప్‌ పేపర్లు తయారుచేశాడు? ఇందులో ఎవరెవరున్నారు? చివరికీ కరీం ఎలా పట్టుబడ్డాడు? అనే ఆసక్తికర కథనంతో స్కామ్ 2003 వెబ్ సిరీస్‌ తెరకెక్కింది. ఈ సిరీస్‌కు తుషార్‌ దర్శకత్వం వహించగా.. అబ్దుల్‌ కరీం పాత్రలో గగన్‌ దేవ్‌ రియార్‌ నటించారు. అలాగే అనిరుద్ధ్ రాయ్, సత్యం శ్రీవాస్తవ, విశాల్ సి. భరద్వాజ్ తదిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.తాజాగా ఈ సిరీస్‌ టీజర్‌ రీలీజైంది. ఇది ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.

Follow Us
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది