Prema Volunteer: జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ హీరోగా ‘ప్రేమ వాలంటీర్‌’ .. తెలుగు వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా?

బర్దస్త్‌ ఇమ్మానుయేలు సడెన్‌గా హీరోగా మారిపోయాడు. ఓ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తన ఫ్రెండ్స్‌తోనే కలిసి 'ప్రేమ వాలంటీర్‌' అనే వెబ్‌ సిరీస్‌తో రూపొందించాడు ఇమ్మాన్యుయేల్‌. తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో గ్రామ వాలంటీర్‌గా కనిపించనున్నాడు ఇమ్మాన్యుయేల్‌. వృద్ధులకు పెన్షన్లు పంచడం, అలాగే అమ్మాయిని ప్రేమలో పడేసేందుకు..

Prema Volunteer: జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ హీరోగా 'ప్రేమ వాలంటీర్‌' .. తెలుగు వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా?
Prema Volunteer web series
Follow us
Basha Shek

|

Updated on: Aug 05, 2023 | 3:00 PM

ఇమ్మాన్యుయేల్‌.. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ కామెడీ షో వేదికగా నవ్వులు పువ్వులు పంచుతుంటాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. లేడీ కమెడియన్‌ వర్షతో కలిసి అతను చేసే స్కిట్లు బుల్లితెర ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. సిల్వర్‌ స్క్రీన్‌పైనా అప్పుడప్పుడూ మెరుస్తుంటాడు ఇమ్మాన్యుయేల్‌. ఇక సోషల్‌ మీడియాలోనూ ఈ స్టార్‌ కమెడియన్‌కు బోలెడు ఫాలోయింగ్‌ ఉంది. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ ఆసక్తికరమైన వీడియోలు షేర్‌ చేస్తుంటాడు. అయితే జబర్దస్త్‌ ఇమ్మానుయేలు సడెన్‌గా హీరోగా మారిపోయాడు. ఓ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తన ఫ్రెండ్స్‌తోనే కలిసి ‘ప్రేమ వాలంటీర్‌’ అనే వెబ్‌ సిరీస్‌తో రూపొందించాడు ఇమ్మాన్యుయేల్‌. తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో గ్రామ వాలంటీర్‌గా కనిపించనున్నాడు ఇమ్మాన్యుయేల్‌. వృద్ధులకు పెన్షన్లు పంచడం, అలాగే హీరోయిన్‌ను ప్రేమలో పడేసేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనడం.. ఇలా ఎంతో ఆసక్తికరంగా సాగింది ప్రేమ వాలంటీర్‌ ట్రైలర్‌.  చూస్తుంటే ఇది ఒక పక్కా పల్లెటూరి ప్రేమకథ అని తెలుస్తోంది.

రిస్క్‌ ఎందుకు బ్రో..

ఇక్కడ మరో విశేషమేమిటంటే ‘ప్రేమ వాలంటీర్‌’ వెబ్‌ సిరీస్‌కు జబర్దస్త్ బాబునే రచన, దర్శకత్వం వహించడం విశేషం. ఇమ్మానుయేలుకు జంటగా విజయ విజ్జు నటించింది. అలాగే గోపి, అనూష, దివాకర్, పుష్పమ్మ, జయరాం, రాజు తాత, మహేష్, మార్క్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వెంకీ వీణ పాటలు, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ సమకూర్చారు. హేమంత్ చిన్నోడ సినిమాటోగ్రఫీ బాధ్యతలు సమకూర్చారు. కాగా ఏపీలో ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థపై పెద్ద చర్చే నడుస్తోంది. వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌తో పాటు చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్‌పై వెబ్‌ సిరీస్‌ రావడం ఆసక్తికరంగా మారింది. ఈక్రమంలో చాలామంది ఇమ్మాన్యుయేల్‌కు సపోర్టుగా శుభాకాంక్షలు చెబుతుంటే, మరికొంత మంది ‘ఎందుకీ రిస్క్ బ్రో’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రేమ వాలంటీర్‌ వెబ్ సిరీస్ ట్రైలర్