AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: చికిత్స కోసం సమంతకు స్టార్ హీరో రూ.25 కోట్ల సాయం.. అసలు విషయం చెప్పేసిన సామ్..

కొద్ది రోజులుగా సమంతకు ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఏకంగా రూ.25 కోట్లు సాయం చేశారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించారు సామ్. తన చికిత్స కోసం స్టార్ హీరో సాయమంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదన్నారు. ఈ విషయాన్ని తన ఇన్ స్టా వేదికగా తెలియజేశారు.

Samantha: చికిత్స కోసం సమంతకు స్టార్ హీరో రూ.25 కోట్ల సాయం.. అసలు విషయం చెప్పేసిన సామ్..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 05, 2023 | 3:29 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. విడాకుల తర్వాత సామ్ వ్యక్తిగత జీవితం గురించి రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తన గురించి వస్తోన్న వార్తలపై సామ్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నప్పటికీ పూకార్లు మాత్రం ఆగడం లేదు. అలాగే ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరలవుంటుంది. సినిమాలు, వ్యక్తిగత విషయాల గురించి అనేక రూమర్స్ వినిపిస్తున్నప్పటికీ.. వాటిని పట్టించుకోకుండా నెట్టింట యాక్టివ్ గా ఉంటున్నారు సామ్. ఇక కొద్ది రోజులుగా సమంతకు ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఏకంగా రూ.25 కోట్లు సాయం చేశారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించారు సామ్. తన చికిత్స కోసం స్టార్ హీరో సాయమంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదన్నారు. ఈ విషయాన్ని తన ఇన్ స్టా వేదికగా తెలియజేశారు.

“మయోసైటిస్ చికిత్సకు రూ.25 కోట్లు సాయం చేశారా ?.. ఎవరో మీకు తప్పుడు సమాచారం అందించారు. మీరు అంటున్న దానిలో అతి తక్కువ మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నాను. కెరీర్ లో ఇప్పటివరకు పనిచేసినందుకు జీతంగా రాళ్లూ రప్పలు ఇవ్వలేదు. నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మయోసైటిస్ కారణంగా ఎన్నో వేల మంది బాధపడుతున్నారు. చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని అందించేముందు దయచేసి బాధ్యతగా వ్యవహరించండి. ” అంటూ ఓ నోట్ షేర్ చేసింది సామ్.

Samantha Instagram Post

Samantha Instagram Post

గత కొంతకాలంగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సామ్.. కొద్ది రోజుల క్రితం ఇంట్లోనే చికిత్స తీసుకున్నారు. ఈ వ్యాధి నుంచి కాస్త కోలుకున్నాక ఆమె ఖుషి, సిటాడెల్ సినిమాల్లో నటించారు. త్వరలోనే ఈ రెండు సినిమాలు అడియన్స్ ముందుకు రానున్నాయి. ఇందులో ఖుషి సినిమాపై ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటి నెలకొంది. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.