Bhola Shankar: సినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ ‘భోళా శంకర్’ మూవీ టికెట్ ధరలపై కీలక నిర్ణయం
గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య విజయాలతో మంచి జోష్‌లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈసారి హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు భోళాశంకరుడిగా మన ముందుకు వస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన భోళాశంకర్ మరో 6 రోజుల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫీవర్ నెలకొంది. కటౌట్లు, పోస్టర్లు భారీగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు చిత్ర యూనిట్ కూడా
గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య విజయాలతో మంచి జోష్‌లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈసారి హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు భోళాశంకరుడిగా మన ముందుకు వస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన భోళాశంకర్ మరో 6 రోజుల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫీవర్ నెలకొంది. కటౌట్లు, పోస్టర్లు భారీగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్లను విస్తృతం చేసింది. ఇందులో ఆదివారం గ్రాండ్‌గా ప్రి రిలీజ్ ఈవెంట్ జరపనన్నారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ ఫంక్షన్ నిర్వహించనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఇక భోళాశంకర్ మూవీ సెన్సార్ కూడా పూర్తయ్యింది. సెన్సార్ బోర్డ్ మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి యూ/ఏ (U/A) రేటింగ్ ఇచ్చింది. ఇక భోళాశంకర్ రన్‌టైమ్ సుమారు 160 నిమిషాలు (2 గంటల 40 నిమిషాలు) ఉండనుంది. కాగా ఇటీవల పెద్ద హీరోల సినిమాలు రిలీజైనప్పుడు టికెట్ల ధరలు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. అయితే భోళా శంకర్ టికెట్ల ధరల విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
స్టాండర్స్ ధరలే కంటిన్యూ..
భోళా శంకర్ సినిమా టికెట్ రేట్లను పెంచకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. కాబట్టి థియేటర్లలో ప్రస్తుతమున్న ధరలే చిరంజీవి సినిమాకు ఉండనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‍లోని కొన్ని థియేటర్లలో భోళా శంకర్ సినిమా అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. మరో రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యే అవకాశముంది. భోళాశంకర్ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీబ్యూటీ తమన్నా భాటియా కథానాయికగా నటిస్తోంది. మహానటి కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలిగా కనిపించనుంది. అలాగే సుశాంత్, మురళీ శర్మ, రావు రమేష్, జబరర్దస్త్ రష్మీ, శ్రీముఖి, వెన్నెల కిశోర్, రవిశంకర్, రఘుబాబు, ఉత్తేజ్, గెటప్ శీను తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర భోళాశంకర్ మూవీని నిర్మించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.