- Telugu News Photo Gallery Cinema photos Tamil actress Dushara Vijayan Interesting Commets about Glamour Roles telugu cinema news
Dushara Vijayan: అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది.. నాకు హద్దులు తెలుసు.. హీరోయిన్ దుషారా కామెంట్స్..
డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహించిన సార్పట్టా పరంపరై సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది దుషారా విజయన్. ఈ చిత్రం కోలీవుడ్ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించింది. కథానాయికగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది దుషారా. తమిళనాడు రాజకీయ కుటుంబం నుంచి సినీ రంగప్రవేశం చేసిన హీరోయిన్ దుషారా.. ఇటీవల అనిత చిత్రంలో నటించింది.
Updated on: Aug 05, 2023 | 4:06 PM

డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహించిన సార్పట్టా పరంపరై సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది దుషారా విజయన్. ఈ చిత్రం కోలీవుడ్ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించింది. కథానాయికగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది దుషారా.

తమిళనాడు రాజకీయ కుటుంబం నుంచి సినీ రంగప్రవేశం చేసిన హీరోయిన్ దుషారా.. ఇటీవల అనిత చిత్రంలో నటించింది. ఇందులో నటుడు అర్జున్ దాస్ తో పోటీ పడి నటించి ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ధనుష్, డైరెక్టర్ బాలాజీ మోహన్ దర్శకత్వంలో ఛాన్స్ కొట్టేసింది.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న దుషారా..తనకు నటన అంటే చాలా ఇష్టమని చెప్పింది. అందుకే ఎలాంటి పాత్రలో నటించడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే తన పాత్ర ఐదు నిమిషాలు ఉన్నా పాత్రకు ప్రాధాన్యత ఉండాలన్నారు.

కుటుంబకథా చిత్రాలకు కథానాయికగా ఇమేజ్ తెచ్చుకున్న తనను గ్లామర్ పాత్రల్లో నటిస్తారా అని అడగ్గా.. అందానికి.. అశ్లీలతకు చాలా తేడా ఉందని.. అలా ప్రేక్షకులు ముఖం తిప్పుకునేది ఏది గ్లామర్ కాదని అన్నారు.

అందాల ఆరబోతలో హద్దలు తనకు తెలుసునని..అలా పరిమితులతో కూడిన గ్లామర్ పాత్రల్లో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇండస్ట్రీలో బాలు మహేంద్ర, మణిరత్నం అంటే చాలా ఇష్టమని చెప్పారు.

అందంగా కనిపించేంత వరకు ఒకే కానీ.. అశ్లీలంగా కనిపించేందుకు మాత్రం తాను ఆసక్తి చూపించనంటూ చెప్పుకొచ్చింది దుషారా.




