- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna Got the Lucky Chance to act with Shah Rukh Khan movie telugu cinema news
Rashmika Mandanna: రష్మిక లక్ మాములుగా లేదుగా.. షారుఖ్ సరసన నేషనల్ క్రష్…
దక్షిణాది హీరోయిన్ రష్మిక మందన్నా.. ఇప్పుడు పాన్ ఇండియా బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ వరుస అవకాశాలు క్యూకడుతున్నాయి. ఇప్పుడు ఈ నేషనల్ క్రష్ పుష్ప2, యానిమల్ చిత్రాల్లో నటిస్తోంది. త్వరలోనే ఈ రెండు సినిమాలు అడియన్ ముందుకు రానున్నాయి.
Updated on: Aug 05, 2023 | 4:33 PM

దక్షిణాది హీరోయిన్ రష్మిక మందన్నా.. ఇప్పుడు పాన్ ఇండియా బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ వరుస అవకాశాలు క్యూకడుతున్నాయి.

ఇప్పుడు ఈ నేషనల్ క్రష్ పుష్ప2, యానిమల్ చిత్రాల్లో నటిస్తోంది. త్వరలోనే ఈ రెండు సినిమాలు అడియన్ ముందుకు రానున్నాయి. అయితే సౌత్ కంటే నార్త్ లోనే వరుస అవకాశాలు అందుకుంటుంది రష్మిక.

ఇప్పటికే గుడ్ బై, మిషన్ మజ్నూ వంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి ఇప్పుడు లక్కీ ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా వినిపిస్తోన్న వార్తల ప్రకారం నేషనల్ క్రష్ ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన నటించే అవకాశం దక్కించుకుందట.

చాలా మంది హీరోయిన్స్ షారుఖ్ సినిమాల్లో నటించాలని కోరుకుంటారు. అలాంటిది తక్కువ సమయంలోనే రష్మికకు క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇదే నిజమైతే రష్మికకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవాలి.

ఇదే కాకుండా.. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశాల్ సరసన నటించనుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథగా రాబోతున్న సినిమాలో రష్మిక నటించనుంది.

ఇవే కాకుండా.. మరోసారి పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది ఈ బ్యూటీ. డైరక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్నారు.




