- Telugu News Photo Gallery Cinema photos Actress Saiyami Kher Hope on Ghoomer Movie with Abhishek Bachchan in bollywood Telugu Entertainment Photos
Saiyami Kher: ఇండస్ట్రీకి వచ్చి 8 ఏళ్ళు.. టాలీవుడ్ నుండి బాలీవుడ్ చెక్కేసింది.. అయినా..?
ఎనిమిదేళ్లుగా హీరోయిన్‌గా కంటిన్యూ అవుతున్నా.. ఇంకా పది సినిమాలు కూడా పూర్తి చేయని ఈ బ్యూటీ, త్వరలో ఓ ఛాలెంజింగ్ రోల్‌లో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ. సాయి ధరమ్ తేజ్ తొలి సినిమా రేయ్‌తో సిల్వర్ స్క్రీన్‌కు పరియమైన బ్యూటీ సయామీ ఖేర్. తొలి సినిమానే డిజాస్టర్ కావటంతో ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో అవకాశాలు రాలేదు.
Updated on: Aug 05, 2023 | 7:11 PM

తెలుగు సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా.. బాలీవుడ్‌లో సెటిల్ అయిన టాలెంట్ బ్యూటీ సయామీ ఖేర్.

ఎనిమిదేళ్లుగా హీరోయిన్‌గా కంటిన్యూ అవుతున్నా.. ఇంకా పది సినిమాలు కూడా పూర్తి చేయని ఈ బ్యూటీ, త్వరలో ఓ ఛాలెంజింగ్ రోల్‌లో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ.

సాయి ధరమ్ తేజ్ తొలి సినిమా రేయ్‌తో సిల్వర్ స్క్రీన్‌కు పరియమైన బ్యూటీ సయామీ ఖేర్. తొలి సినిమానే డిజాస్టర్ కావటంతో ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో అవకాశాలు రాలేదు.

దీంతో బాలీవుడ్‌కు షిప్ట్ అయిన సయామీ అక్కడ కూడా అన్నకున్న రేంజ్‌లో అవకాశాలు సాధించలేకపోయారు. అందుకే త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఘూమర్ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు సయామీ.

అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ఘూమర్. ఈ సినిమాలో దివ్యాంగురాలైన క్రికెట్ ప్లేయర్‌గా నటించారు సయామీ. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా తన కెరీర్ ఎర్లీ డేస్‌ను గుర్తు చేసుకున్నారు సయామీ ఖేర్.

కెరీర్ స్టార్టింగ్లో తన లుక్స్ విషయంలో చాలా మంది నెగెటివ్ కామెంట్స్ చేశారన్న సయామీ, కొంతమంది సర్జరీ చేయించకోమని సజెషన్స్ కూడా ఇచ్చారని చెప్పారు. అయితే గ్లామర్ కన్నా, నటనతోనే మెప్పించాలన్న ఉద్దేశ్యంతో ఆ కామెంట్స్‌ను పట్టించుకోలేదన్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయంటున్నారు సయామీ ఖేర్. ఇప్పుడు లుక్స్ కన్నా టాలెంట్‌కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని.. ఇంది మంచి పరిణామమన్నారు. ఘూమర్ సినిమాతో తాను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బ్రేక్ వస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు ఈ బ్యూటీ.




