AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Sruthi: భర్త పోయిన బాధలో ఉన్నా.. దయచేసి అలాంటి రూమర్లతో నన్ను వేధించకండి: నటి శ్రుతి

ప్రముఖ బుల్లితెర నటి శ్రుతి శణ్ముగప్రియ భర్త అరవింద్‌ శేఖర్‌ ఇటీవల గుండెపోటుతో కన్నుమూశారు. గతేడాది వీరికి వివాహమైంది. అయితే ఇంతలోనే కేవలం 30 ఏళ్ల వయసులోనే అరవింద్‌ కన్నుమూయడం అందరినీ కలిచివేస్తోంది. ఈనేపథ్యంలో నటి శ్రుతితో పాటు కుటుంబ సభ్యులకు చాలామంది అభిమానులు, నెటిజన్లు ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు. అరవింద్‌ ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తున్నారు.

Actress Sruthi: భర్త పోయిన బాధలో ఉన్నా.. దయచేసి అలాంటి రూమర్లతో నన్ను వేధించకండి: నటి శ్రుతి
Actress Sruthi
Follow us
Basha Shek

|

Updated on: Aug 05, 2023 | 9:39 PM

ప్రముఖ బుల్లితెర నటి శ్రుతి శణ్ముగప్రియ భర్త అరవింద్‌ శేఖర్‌ ఇటీవల గుండెపోటుతో కన్నుమూశారు. గతేడాది వీరికి వివాహమైంది. అయితే ఇంతలోనే కేవలం 30 ఏళ్ల వయసులోనే అరవింద్‌ కన్నుమూయడం అందరినీ కలిచివేస్తోంది. ఈనేపథ్యంలో నటి శ్రుతితో పాటు కుటుంబ సభ్యులకు చాలామంది అభిమానులు, నెటిజన్లు ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు. అరవింద్‌ ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తున్నారు. అయితే ఇదే సమయంలో అరవింద్‌ మరణంపై కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌, వెబ్‌సైట్స్‌, సోషల్‌ మీడియా రకరకాలుగా దుష్ఫ్రచారం చేస్తున్నాయి. మంచి బాడీ బిల్డరైన అరవింద్‌ హఠాన్మరణానికి అతనికున్న చెడు అలవాట్లే కారణమంటూ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. భర్త మరణంతో ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన శ్రుతి, అలాగే అరవింద్ కుటుంబ సభ్యులకు ఈ కథనాలు మరింత ఆవేదనను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రుతి సోషల్‌ మీడియాలో ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. తన భర్త మరణంపై తప్పుడు వార్తలు ప్రచారం చేయద్దని చేతులెత్తి అభ్యర్థించింది. ‘ప్రస్తుతం నేను చాలా క్లిష్టమైన పరిస్థితలో ఉన్నాను. చాలా మంది నన్ను ఓదార్చేందుకు కాల్స్‌, మెసేజ్‌లు పంపిస్తున్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి సమయంలో యూట్యూబ్ ఛానెల్స్ , మీడియా వారందరికీ నాదొక మనవి. నా భర్త కార్డియాక్‌ అరెస్టుతోనే కన్నుమూశారు. డాక్టర్లు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కానీ నిజమేంటో తెలుసుకోకుండా మా ఆయన మరణంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడందరం పుట్టెడు దుఃఖంలో ఉన్నాం. ఇలాంటి సమయంలో మీ వ్యూస్ కోసం, లైకుల కోసం మమ్మల్ని ఇలా వేధించకండి’ అని రిక్వెస్ట్ చేసింది శ్రుతి.

కాగా తమిళంలో పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించింది శ్రుతి. ఇక ఆమె భర్త అరవింద్‌ శేఖర్‌ కూడా 2002లో మిస్టర్‌ తమిళనాడుగా గుర్తింపు పొందాడు. అతను మంచి బాడీ బిల్డర్‌. ఫిట్‌నెస్‌పై కూడా ఎక్కువ దృష్టి పెడతాడు. అలాంటి అరవింద్‌కు బుధవారం ( ఆగస్టు 2వ తేదీ) సాయంత్రం హఠాత్తుగా గుండె పోటుతో కన్నుమూయడం అందరినీ కలిచివేసింది. శ్రుతి, అరవింద్‌లు గత ఏడాది మేలోనే వివాహం చేసుకోవడం గమనార్హం. పెళ్లికి ముందు కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరు పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు. భర్తతో కడదాకా కష్టసుఖాలు పంచుకోవాలనుకున్నకలలుగంది శ్రుతి. అయితే ఇప్పుడా కలలు కల్లలయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..