AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandramukhi 2: చంద్రముఖిగా బాలీవుడ్ బ్యూటీ భయపెట్టనుందా ?.. కంగనా రనౌత్ ఫస్ట్ లుక్..

తాజాగా విడుదలైన పోస్టర్ లో కంగనా లుక్ ఆకట్టుకుంటుంది. అందులో బంగారు అభ‌ర‌ణాలు, ప‌ట్టు వ‌స్త్రాల‌తో రాజ న‌ర్త‌కి చంద్ర‌ముఖి పాత్ర‌లో కంగ‌నా లుక్ మెస్మ‌రైజ్ చేస్తోంది. ఇప్పుడు విడుదలైన పోస్టర్ తో మూవీపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. 2005లో పి.వాసు ద‌ర్శక‌త్వం వహించిన ‘చంద్ర‌ముఖి’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ రానుంది.

Chandramukhi 2
Rajitha Chanti
|

Updated on: Aug 06, 2023 | 12:42 AM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా నటించిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. అప్పట్లో ఈ మూవీ కలెక్షన్స్ సునామి సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. కొద్ది రోజులుగా చంద్రముఖి సీక్వెల్ షూటింగ్ జరుపుకుంటుంది. స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. హార‌ర్ జోన‌ర్‌లో స‌రికొత్త సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసిన చంద్ర‌ముఖి చిత్రానికి కొన‌సాగింపుగా వస్తోన్న ఈ మూవీ నుంచి తాజాగా కంగనా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

తాజాగా విడుదలైన పోస్టర్ లో కంగనా లుక్ ఆకట్టుకుంటుంది. అందులో బంగారు అభ‌ర‌ణాలు, ప‌ట్టు వ‌స్త్రాల‌తో రాజ న‌ర్త‌కి చంద్ర‌ముఖి పాత్ర‌లో కంగ‌నా లుక్ మెస్మ‌రైజ్ చేస్తోంది. ఇప్పుడు విడుదలైన పోస్టర్ తో మూవీపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. 2005లో పి.వాసు ద‌ర్శక‌త్వం వహించిన ‘చంద్ర‌ముఖి’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ రానుంది.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రాన్ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌ల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే అనౌన్స్ చేశారు. అలాగే ఆస్కార్ విన్న‌ర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ఈ మూవీకి ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత తోట త‌ర‌ణి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌, ఆంథోని ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో

వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?

పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో

స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో

ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో

ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ

టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి

చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో

పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు