Tamannaah: ప్రేమ చెప్పినప్పుడు పెళ్లి గురించి చెప్పలేనా ?.. తమన్నా..

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్, సూపర్ స్టార్ రజినీ కాంత్ జోడిగా జైలర్ చిత్రాల్లో నటిస్తోంది తమన్నా. ఈ రెండు చిత్రాలు త్వరలోనే అడియన్స్ ముందుకు రానున్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న మిల్కీబ్యూటీ తన ఫిల్మ్ కెరీర్ గురించి చెప్పుకొచ్చింది. ఇద్దరు అగ్ర హీరోలతో కలిసి ఒకేసారి అటు తమిళ్, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించనుండడం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని..

Tamannaah: ప్రేమ చెప్పినప్పుడు పెళ్లి గురించి చెప్పలేనా ?.. తమన్నా..
Tamannaah
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 05, 2023 | 6:29 PM

టాలీవుడ్ మిల్కీబ్యూటీ.. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. ఇండస్ట్రీలోకి కథానాయికగా అడుగుపెట్టి దాదాపు 17 ఏళ్ల గడుస్తున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా గడిపేస్తుంది. ఓవైపు వెండితెరపై.. మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ప్రేక్షకులను అలరిస్తోంది ఈ బ్యూటీ. అయితే కొద్ది రోజులుగా తమన్నా… సినిమా అప్డేట్స్ కాకుండా వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తలలో ఉంటుంది. ఇటీవలే ఆమె తన ప్రేమ విషయాన్ని కన్ఫార్మ్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరు కలిసి ఈవెంట్స్, రెస్టారెంట్స్ అంటూ తెగ తిరిగేయడంతో వీరి ప్రేమ విషయాన్ని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఇక వీరిద్దరు కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ ప్రమోషన్లలో తమ ప్రేమ గురించి ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే అన్నట్లుగా తమన్నా క్లారిటీ ఇవ్వగా.. మిల్కీబ్యూటీ తనకు ప్రత్యేకమైన స్నేహితురాలు అంటూ చెప్పుకొచ్చారు విజయ్ వర్మ. దీంతో వీరి ప్రేమ విషయానికి తాత్కాలికంగా బ్రేక్ పడినప్పటికీ నెట్టింట చర్చ మాత్రం ఆగలేదు. తాజాగా తన పెళ్లి గురించి మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేసింది తమన్నా.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్, సూపర్ స్టార్ రజినీ కాంత్ జోడిగా జైలర్ చిత్రాల్లో నటిస్తోంది తమన్నా. ఈ రెండు చిత్రాలు త్వరలోనే అడియన్స్ ముందుకు రానున్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న మిల్కీబ్యూటీ తన ఫిల్మ్ కెరీర్ గురించి చెప్పుకొచ్చింది. ఇద్దరు అగ్ర హీరోలతో కలిసి ఒకేసారి అటు తమిళ్, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించనుండడం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని.. ఓ నటిగా తన కల నిజమైనట్లుందని సంతోషం వ్యక్తం చేసింది. అలాగే తన ప్రేమ, పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

“మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి నటించే అవకాశం సైరా సినిమాతో దొరికింది. కానీ డాన్స్ మాత్రం చేయలేకపోయాను. ఇప్పుడు భోళా శంకర్ సినిమాతో ఆ కోరిక నెరవేరింది. అలాగే జైలర్ సినిమాలో నా పాత్ర చిన్నది. కానీ భారీ తారాగణముతో కలిసి పనిచేశాను. నా 18ఏళ్ల సినీ ప్రయాణంలో అటు స్టార్ హీరోస్.. ఇటు యంగ్ హీరోస్ ఇద్దరితో కలిసి పనిచేశాను. వారి వయసు గురించి ఎప్పుడు ఆలోచించను. ఇక పెళ్లి విషయానికి వస్తే.. ఏదైనా ముక్కు సూటిగానే చెప్పేస్తాను. ప్రేమ విషయాన్ని నాకు నేనుగానే బయటపెట్టాను. అలాగే పెళ్లి గురించి కూడా సమయం వచ్చినప్పుడు స్వయంగా ప్రకటిస్తాను. ఇప్పుడు అలాంటి ఆలోచనలు లేవు” అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.