Rajini Kanth: తలైవాకు తగ్గని క్రేజ్.. జైలర్ కోసం షాకింగ్ రెమ్యూనరేషన్.. కానీ ఆ హీరోకే ఎక్కువట..
జైలర్ చిత్రంపై భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా తర్వాత రజిని మరో రెండు సినిమాల్లో నటించనున్నారట. అందులో జైభీమ్ ఫేమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో టాలీవుడ్ స్టార్ నాని కీలకపాత్రలో నటించనున్నారట. అలాగే అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ కీలకపాత్రలలో నటించనున్నారని టాక్.
సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సౌత్ టూ నార్త్ అత్యధిక ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో రజినీ ఒకరు. ఆయన స్టైల్, యాక్టింగ్, యాటిట్యూడ్ కు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. ఏడు పదుల వయసులోనూ తలైవా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. వయసు పెరిగినప్పటికీ ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా జైలర్. ముందు నుంచి ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ నటుడు సునీల్, రమ్యకృష్ణ, హీరోయిన్ తమన్నా కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాను ఆగస్ట్ 10న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్.
కొద్ది రోజులుగా చిత్రయూనిట్ వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీలోని తారాగణం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జైలర్ సినిమా కోసం రజినీ కాంత్ ఏకంగా రూ.100 నుంచి 110 కోట్ల వరకు తీసుకుంటున్నాడట. అంటే సినిమా బడ్జెట్ లో దాదాపు సగం ఆయన పారితోషికానికే అని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో అతిథి పాత్రలో నటిస్తోన్న మోహన్ లాల్ అందుకోసం రూ.8 కోట్లు తీసుకుంటున్నాడట. అలాగే జాకీ ష్రాఫ్ రూ. 4 కోట్లు, శివరాజ్ కుమార్ రూ.4 కోట్లు తీసుకుంటున్నట్లుగా తమిళ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉంటే.. తమన్నాకు రూ. 3 కోట్లు, రమ్యకృష్ణకు రూ.80 లక్షలు తీసుకుంటున్నట్లుగా టాక్. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న జైలర్ సినిమా దాదాపు 2 గంటల 49 నిమిషాల రన్ టైమ్ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక జైలర్ ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేసింది. తమిళంతోపాటు.. తెలుగులోనూ ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే జైలర్ చిత్రంపై భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా తర్వాత రజిని మరో రెండు సినిమాల్లో నటించనున్నారట. అందులో జైభీమ్ ఫేమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో టాలీవుడ్ స్టార్ నాని కీలకపాత్రలో నటించనున్నారట. అలాగే అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ కీలకపాత్రలలో నటించనున్నారని టాక్.