AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Klin Kaara: తొలిసారి మనవరాలు ఇంటికి వచ్చిన వేళ.. ఉపాసన తల్లి ఏం చేసిందో తెలుసా? పనివాళ్లకు ఏకంగా..

మెగా ప్రిన్సెస్‌ రాకతో మెగా ఫ్యామిలీ ఉబ్బితబ్బిబ్బవుతోంది. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొన్ని రోజుల క్రితమే పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. పెళ్లైన 11 ఏళ్లకు బిడ్డ పుట్టడంతో రామ్‌ చరణ్‌ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక మనవరాలి రాకతో చిరంజీవి- సురేఖ కూడా మురిసిపోయారు. అభిమానులు కూడా..

Klin Kaara:  తొలిసారి మనవరాలు ఇంటికి వచ్చిన వేళ.. ఉపాసన తల్లి ఏం చేసిందో తెలుసా? పనివాళ్లకు ఏకంగా..
Ram Charan, Upasana
Basha Shek
|

Updated on: Aug 05, 2023 | 8:07 PM

Share

మెగా ప్రిన్సెస్‌ రాకతో మెగా ఫ్యామిలీ ఉబ్బితబ్బిబ్బవుతోంది. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొన్ని రోజుల క్రితమే పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. పెళ్లైన 11 ఏళ్లకు బిడ్డ పుట్టడంతో రామ్‌ చరణ్‌ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక మనవరాలి రాకతో చిరంజీవి- సురేఖ కూడా మురిసిపోయారు. అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత వేడుకగా బారసాల చేసి మెగా ప్రిన్సెస్‌కు క్లింకార కొణిదెల అని నామకరణం చేశారు. కాగా అమ్మగా ప్రమోషన్‌ పొందిన తర్వాత తొలిసారిగా ఉపాసన తన పుట్టింటికి వెళ్లిందట. అక్కడ ఆమె తల్లి కామినేని శోభన మనవరాలికి స్వాగతం పలికేందుకు గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారట. తన మనవరాలిని ఇంట్లోకి తీసుకొచ్చేముందుకు పనివాళ్లతో దిష్టి తీయించిందట. అంతేకాదు.. వారికి ఏకంగా రూ. 10 లక్షలు ఇచ్చారట. ఇప్పుడీ వార్త టాలీవుడ్‌ ఫిల్మ్‌ సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. సాధారణంగా దిష్టి తీస్తే వందలు, వేలు ఇస్తారు. అయితే మనవరాలు క్లింకార ఇంటికొచ్చిన సందర్బంగా పనివాళ్లకు ఏకంగా రూ. 10 లక్షలు ఇవ్వడంపై చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో మెగాభిమానులు మాత్రం ఈ శుభసందర్భంలో పనివాళ్లకు మంచి బహుమతినే ఇచ్చారు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా మెగా ప్రిన్సెస్‌ ముఖాన్ని చూసేందుకు అభిమానులు, నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు మెగా వారసురాలు క్లింకారకు సెలబ్రిటీల నుంచి బహుమతులు అందుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం యంగ్‌ హీరో శర్వానంద్‌ రామ్‌ చరణ్ కూతురికి స్పెషల్‌ గిఫ్ట్‌ పంపించారట. అలాగే యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కూడా తన స్నేహితుడి గారాల పట్టికి గోల్డ్‌ డాలర్స్ కానుకగా ఇచ్చారట. ఇక ఇటీవల ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన కోడలికి మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చారట. క్లింకార పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలు వచ్చేలా బంగారు అక్షరాలతో డిజైన్‌ చేయించిన పలకను బహుమతిగా ఇచ్చారట. మొత్తానికి అప్పుడే క్లింకార స్టార్ సెలబ్రిటీ అయిపోయిందంటున్నారు మెగా ఫ్యాన్స్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..
భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..
అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్!
అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్!