OTT Movies: ఎంటర్‌టైన్మెంట్‌ అదిరిపోద్దంతే.. ఆగస్టులో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానున్న తెలుగు సినిమాలివే

ఆగస్టు నెలకు సంబంధించి పలు సూపర్‌ హిట్ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మొదటి వారంలో నాగశౌర్య రంగబలి, పరేషాన్‌, భాగ్‌ సాలే సినిమాలతో పాటు జేడీ చక్రవర్తి దయా వెబ్‌ సిరీస్‌లు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. కాగా ఈ నెలలో మరికొన్ని హిట్‌ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అశ్విన్‌ నటించిన హిడింబ.

OTT Movies: ఎంటర్‌టైన్మెంట్‌ అదిరిపోద్దంతే.. ఆగస్టులో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానున్న తెలుగు సినిమాలివే
Ott Movies In August
Follow us
Basha Shek

|

Updated on: Aug 07, 2023 | 6:20 AM

ఆగస్టు నెలకు సంబంధించి పలు సూపర్‌ హిట్ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మొదటి వారంలో నాగశౌర్య రంగబలి, పరేషాన్‌, భాగ్‌ సాలే సినిమాలతో పాటు జేడీ చక్రవర్తి దయా వెబ్‌ సిరీస్‌లు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. కాగా ఈ నెలలో మరికొన్ని హిట్‌ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అశ్విన్‌ నటించిన హిడింబ. నందిత శ్వేత హీరోయిన్‌గా నటించింది. ఇన్వెస్టిగేషన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా విడుదలైన ఈ చిత్రం థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. అలాగే రెట్రో క్రైమ్‌ కామెడీగా రూపొందిన అన్నపూర్ణ ఫొటో స్టూడియో కూడా ఈనెలలోనే ఓటీటీలో రిలీజ్‌ కానుంది. చైతన్య రావు, లావణ్య జంటగా నటించారు. పల్లెటూరి ప్రేమకథకు క్రైమ్‌ నేపథ్యాన్ని జోడించి రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. వీటితో పాటు ఈ ఆగస్టులో ఓటీటీలో రానున్న సినిమాలు, సిరీస్‌లపై ఒక లుక్కేద్దాం రండి.

1. హిడింబ- ఆహా- ఆగస్టు 10 2. పోర్‌ తోడిల్‌- సోనీలివ్‌- ఆగస్టు 11 3. అన్నపూర్ణ ఫొటో స్టూడియో- ఈటీవీ విన్‌- ఆగస్టు 15 4. విజయ్‌ ఆంటోని హత్య- అమెజాన్ ప్రైమ్ – ఆగస్టు 20

ఇవి కూడా చదవండి

పై సినిమాలతో పాటు ప్రభాస్‌ ఆదిపురుష్‌ కూడా ఆగస్టులోనే ఓటీటీ రిలీజ్‌ కావొచ్చునని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా ఈనెల మూడో వారంలో ఈ మైథలాజికల్‌ మూవీ రిలీజ్ అవుతుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబి చిత్రం కూడా ఈనెలాఖరులో ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. అలాగే ఏజెంట్, రామబాణం మూవీస్‌ ఓటీటీ రిలీజ్‌పై అప్డేట్స్‌ రావాల్సి ఉంది. వీటితో పాటు పలు వివిధ భాషల్లో రిలీజైన సినిమాలు, సిరీస్ లు కూడా ఓటీటీల్లోకి అందుబాటులోకి రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

12 ఇన్నింగ్స్‌ల్లో 70 పరుగులు, రిటైర్మెంట్ చేస్తే పరువైనా దక్కేను
12 ఇన్నింగ్స్‌ల్లో 70 పరుగులు, రిటైర్మెంట్ చేస్తే పరువైనా దక్కేను
మరికాసేపట్లో టీవీ9 వేదికగా గ్రాండ్‌ కాంక్లేవ్‌! మహామహుల చర్చాగోష్
మరికాసేపట్లో టీవీ9 వేదికగా గ్రాండ్‌ కాంక్లేవ్‌! మహామహుల చర్చాగోష్
TGPSC గ్రూప్‌ 1 రద్దుకు సుప్రీం నో.. రెండు పిటిషన్లు కొట్టివేత
TGPSC గ్రూప్‌ 1 రద్దుకు సుప్రీం నో.. రెండు పిటిషన్లు కొట్టివేత
'పవన్ కల్యాణ్ బాబాయి.. థ్యాంక్యూ సో మచ్': అల్లు అర్జున్
'పవన్ కల్యాణ్ బాబాయి.. థ్యాంక్యూ సో మచ్': అల్లు అర్జున్
వెలుగులోకి వస్తున్న ఆర్మీ కాలింగ్ సంస్థ అక్రమాలు..!
వెలుగులోకి వస్తున్న ఆర్మీ కాలింగ్ సంస్థ అక్రమాలు..!
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన సూర్య కంగువా.. ఎక్కడ చూడొచ్చంటే?
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన సూర్య కంగువా.. ఎక్కడ చూడొచ్చంటే?
36వ సెంచరీతో ఏకంగా టీమిండియా దిగ్గజానికే ఎసరెట్టేశావ్‌గా
36వ సెంచరీతో ఏకంగా టీమిండియా దిగ్గజానికే ఎసరెట్టేశావ్‌గా
టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఈ రెండు బెస్ట్ ఫోన్లలో ఏది మంచిదో చెప్పడం కష్టమే..!
ఈ రెండు బెస్ట్ ఫోన్లలో ఏది మంచిదో చెప్పడం కష్టమే..!
ఆసియా ఛాంపియన్ ఎవరు? నేడు భారత్- బంగ్లా మధ్య ఫైనల్ పోరు
ఆసియా ఛాంపియన్ ఎవరు? నేడు భారత్- బంగ్లా మధ్య ఫైనల్ పోరు