Krishna Mukunda Murari, August 7th Episode: కృష్ణ, మురారీలకు మళ్ళీ పెళ్లి.. తాళి కట్టి మెట్టెలు పెట్టినా భర్త కాదంటూ పొడుపు కథ.. విప్పమంటూ మురారీకి సవాల్..

కృష్ణ.. తాళి కడతాడు.. మెట్టెలు తొడుగుతాడు.. ఉంగరం తొడుగుతాడు.. కానీ అతను ఆమెకు భర్త కాదు.. తాళి మెట్టెలు కూడా ఉంటాయి.. కానీ ఆమెకు అతను భర్త కాదు..ఎవరు వాళ్లిద్దరూ.. ఒకరికొరు  ఏమవుతారు.. అని అడుగుతుంది.. అప్పుడు నానోయ్ ఇదేదో కొత్త కాన్సెప్ట్ లా ఉందంటే.. కొత్తగా కాదు చెత్తగా ఉంది. తాళి కట్టాకా భర్త కాకుండా ఏమవుతాడు అని అడుగుతుంది.

Krishna Mukunda Murari, August 7th Episode: కృష్ణ, మురారీలకు మళ్ళీ పెళ్లి.. తాళి కట్టి మెట్టెలు పెట్టినా భర్త కాదంటూ పొడుపు కథ.. విప్పమంటూ మురారీకి సవాల్..
Krishna Mukunda Murari
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Aug 10, 2023 | 8:45 AM

కృష్ణ, మురారిలకు రెండో సారి పెళ్లి చేయడానికి ఇంటికి సభ్యులందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణ ను మురారీలను పెళ్లి వేడుకల కోసం రెడీ చేయడానికి తీసుకొస్తుంటే.. ఓ వైపు ముకుంద వీరిద్దరిని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. మరోవైపు నందు.. కృష్ణ, మురారీల ప్రేమని బయటపెట్టి వారిద్దరిని కలపాలని భావిస్తోంది. కుటుంబం సభ్యులందరూ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్న కృష్ణ, మురారీలను ఆటపట్టిస్తూ ఆనందంగా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గౌతమ్ ఆడవాళ్లు గొప్పా.. లేదా మగవాళ్లు గొప్పా అంటూ  పోటీ మొదలు పెట్టి.. ఇందులో భాగంగా పొదుపు కథల పోటీని ఏర్పాటు చేశాడు.

మగాళ్లు ఓ వైపు చేరితే.. మరొకవైపు స్త్రీలు చేరతారు. లేడీస్ ఫస్ట్ అంటూ ముకుంద కు పొదుపు కథ అడిగే ఛాన్స్ ఇస్తే.. రాజుగారి తోటలో పులతోట చూసేవారు గానీ కోసేవారు లేరని అడిగితే .. అందరూ ఆలోచిస్తే.. గౌతమ్ ఆ పొడుపు కథకు ఆకాశం.. నక్షత్రాలు అని చెబుతాడు. సునంద సరే ఇప్పుడు మీ వంతు మీరు అడగండి అంటే.. మగవారి తరపున తండ్రిని చంపి.. తాతను పూడి.. మళ్ళీ తాతను కన్నది.. మళ్ళీ తలోదారి ఏమిటది అంటే..

దాని సమాధానం చెప్పని కృష్ణను అడగా తెలియదత్తయ్య అని చెబుతూ.. మీ అందరిని ప్రేమని వదిలి నాకు వెళ్లాలని లేదు.. నాకు మీ ప్రేమ శాశ్వతంగా కావాలనిపిస్తుంది మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్లాలని లేదు.. అని తనలో తాను అనుకుంటుంది కృష్ణ.

ఇవి కూడా చదవండి

అప్పుడు నాన్నో.. తండ్రిని ఆస్తికోసం చంపి.. అదే ఆస్తిని దక్కించుకోవడానికి తాతతో కూడినా ఆస్థి దక్కలేదు  అంటే.. అప్పుడు నీ బొందరా.. అది పొదుపు కదా అనుకున్నావా ప్రేతాత్మ కథ అనుకున్నావా అంటూ అడుగుతాడు. దానికి సమాధానం కృష్ణ పెద్దత్తయ్య .. మజ్జిగ అని సమాధానం చెప్పి.. ఈ సారి పొడుపు కథ తింగరి పిల్ల కృష్ణ అడుగుతుంది అని అంటున్నది.

నీ పొదుపు కథ ఎలా ఉండాలంటే.. అందరికి సమాధానం తెలిసినట్లు ఉండాలి.. కానీ ఎవరికీ అర్ధం కాకూడాదు.. అంటూ సూచిస్తుంది.. అప్పుడు ముకుంద .. కృష్ణ పొదుపు కథని అడ్డం పెట్టుకుని తన ప్రేమని  చెప్పేస్తుందా అని ఆలోచిస్తే.. మురారీ .. మా పెళ్లి గురించి చెబుతుందా అని ఆలోచిస్తూ ఉంటాడు.

అప్పుడు కృష్ణ.. తాళి కడతాడు.. మెట్టెలు తొడుగుతాడు.. ఉంగరం తొడుగుతాడు.. కానీ అతను ఆమెకు భర్త కాదు.. తాళి మెట్టెలు కూడా ఉంటాయి.. కానీ ఆమెకు అతను భర్త కాదు..ఎవరు వాళ్లిద్దరూ.. ఒకరికొరు  ఏమవుతారు.. అని అడుగుతుంది.. అప్పుడు నానోయ్ ఇదేదో కొత్త కాన్సెప్ట్ లా ఉందంటే.. కొత్తగా కాదు చెత్తగా ఉంది. తాళి కట్టాకా భర్త కాకుండా ఏమవుతాడు అని అడుగుతుంది.. మురారీ అంటే మనం ఒకరికొకరం ఏమీ కామా అని ఆలోచిస్తుంటే.. సునంద .. కృష్ణకు మురారీ మీద ప్రేమ లేదా అని ఎవరి ఆలోచనల్లో వారు ఉంటారు. వాళ్ళ అగ్రిమెంట్ గురించి చెప్పకనే చెప్పింది.. అంటే కృష్ణ ఇంటి నుంచి నిజంగా వెళ్లిపోతుందా..దేవుడా నా ప్రేమని బతికించడానికి నువ్వు ఉన్నావు అనుకుంటుంది ముకుంద. అప్పుడు పెద్దయ్య ఇదేమీ పొదుపు కథే తింగరి . అసలు నీవు అడిగిన పొడుపు కథకు అర్ధం ఉందా. అంటే ఉంది పెద్దయ్య అంటూ..

ఏమిటి అది అంటుంది కృష్ణ పెద్దత్తయ్య.. సమాధానం చెప్పాలంటే మురారీని చూస్తావేంటి అంటే.. కృష్ణ.. ఏసీపీ సార్.. అంటే.. అందరూ షాక్ తింటారు.. అప్పుడు ముకుంద సంతోషంగా అది లెక్క.. ఇన్నిరోజులు ఎదురుచూస్తున్నా అంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంటే..

కృష్ణ.. ఏసీపీ సార్ దీనికి సమాధానం మీకు తెలుసు చెప్పక పొతే ఓడిపోతారు అంటే.. అంటే అగ్రమెంట్ పెళ్లిగురించి చెప్పమని అడుగుతుందా అని ఆలోచిస్తూ నాకు ఈ పొదుపు కథకు సమాధానం తెలియదు.. అపుడు కృష్ణా అంతలేదు.. నిజనంగా మీకు సమాధానం తెలియదా అని రెట్టిస్తుంది..

మురారీ తెలియదంటున్నాడు కదా . నువ్వే చెప్పు అంటే.. కృష్ణ… సమాధానం చెబుతూ అతను పూజారి అని అంటుంది. అమ్మవారి మెడలో తాళి వేసి మెట్టెలు తొడుగుతాడు అంటూ సమాధానం చెబుతుంది.. వాళ్లిద్దరి  మధ్య దైవత్వం ఉంది.. ఆరాధన కూడా ఉంది. ఇదే నా పొడుపు కథకు సమాధానం.. వావ్ శభాష్ తింగరి పిల్లా.. ఇదే మొత్తానికి నా కోడలు అనిపించుకున్నావ్ అని కృష్ణ పెద్దత్తయ్య పొడుగుతుంది. మరోవైపు మురారీ.. నాకు కూడా జ్ఞానోదయం కల్గింది.. నా పట్ల నీకు ప్రేమ లేదు.. భక్తి మాత్రమే ఉంది అని అనుకుంటాడు.

ముకుంద సూపర్ కృష్ణ నువ్వు.. ఇన్ను తప్పుగా అర్ధం చేసుకున్నా,, నన్ను క్షమించి అని అనుకుంటే.. సునంద మీ ఇద్దరి నుంచి నేను ఇది కోరుకోలేదని ఆలోచిస్తుంది.. మురారీ మీద కృష్ణ కు ఫీలింగ్ లేదా అని రేవతి కూడా ఆలోచిస్తుంది.. అప్పుడు పెద్దయ్య మగవారు తమ భార్యలకు గోరింటాకు పెట్టమని టాస్క్ ఇస్తుంది.

కృష్ణకు మురారీ గోరింటాకు పెడతాడు. గోరింటాకు రెండు చేతులకు పెట్టుకున్న కృష్ణ.. తనకు ఇప్పుడు దురద వేస్తుంది.. ఎలా అని అనుకుంటే.. ఎవరైనా వచ్చి ముక్కు గోకితే అనుకుంటుంటే.. మురారీ వస్తాడు.. ఏసీపీ సార్.. చిన్న హెల్ప్ చేయమని.. అడిగితే.. మీ వేలు చూపించమని అడిగి.. నా ముక్కుకు పై దురదగా ఉంది.. గోకరా.. అని అడుగుతుంది.

నా చేతులకు గోరింటాకు పెట్టింది మీరే.. గోకండి.. ప్లీజ్ అని అడుగుతుంది. మెల్లగా.. గట్టిగా అంటూ హమ్మయ్య హాయిగా ఉంది. అంటుంది. మీతో కలిసి జంటగా పాల్గొనే ఆఖరి వేడుక ఇదేనేమో సార్.. ఆ తాళి నేను తీయను సార్.. మీ జ్ఞాపకాలతో జీవితాంతం గడిపేస్తా అని కృష్ణ అనుకుంటే.. ముకుంద కూడా అదే విధంగా అనుకుంటాడు..

రేపటి ఎపిసోడ్ లో ..

కృష్ణకు మురారీ మళ్ళీ తాళి కడుతుంటే.. మరోవైపు ముకుంద షాకింగ్ చూస్తూ ఉంటుంది..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..