Vimanam: టీవీల్లోకి వచ్చేస్తోన్న విమానం.. ఎప్పుడు ప్రసారం కానుందంటే…
తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధం నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కంట తడి పెట్టించింది. విమానం అంటే ఇష్టమున్న కొడుకు కోరిక నెరవేర్చడానికి ఓ తండ్రి పడే తాపత్రాయం.. చివరకు కళ్ల ముందే కొడుకు ప్రాణాలు కోల్పోవడం. ఇందులో సముద్రఖని తన నటనతో ప్రేక్షకుల హృదయాలను కంటతడి పెట్టించారు.
విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం విమానం. చిన్న చిత్రంగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల మనసులు దొచుకుంది. ఈ సినిమాలో అనసూయ, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్, మీరాజాస్మిన్ కీలకపాత్రలలో నటించారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఓటీటీలోనూ సూపర హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో డైరెక్టర్ శివ ప్రసాద్ యనాల దర్శకుడిగా పరిచయమయ్యాడు. జూన్ 9న విడుదలైన ఈ మూవీ సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. కానీ కమర్షియల్ గా అంతగా హిట్ కాలేకపోయింది. ఇక బుల్లితెరపై అలరించేందుకు సిద్ధమయ్యింది. తండ్రికొడుకుల మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో విడుదలైన ఈ మూవీ ఆగస్ట్ 13న సాయంత్రం 6.30 నిమిషాలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.
తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధం నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కంట తడి పెట్టించింది. విమానం అంటే ఇష్టమున్న కొడుకు కోరిక నెరవేర్చడానికి ఓ తండ్రి పడే తాపత్రాయం.. చివరకు కళ్ల ముందే కొడుకు ప్రాణాలు కోల్పోవడం. ఇందులో సముద్రఖని తన నటనతో ప్రేక్షకుల హృదయాలను కంటతడి పెట్టించారు.
అలాగే వేశ్య సుమతి పాత్రలో మరోసారి అనసూయ మెప్పించింది. ఇక చాలా కాలం తర్వాత మీరా జాస్మిన్ రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే, మ్యూజిక్ కొన్నిసార్లు భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇక ఇప్పటివరకు థియేటర్లు, ఓటీటీలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు టీవీలో రానుంది.