Brahmamudi Serial: నిజం తెలుసుకున్న రాజ్.. నో చెప్పిన కావ్య.. షాక్ లో అపర్ణ
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కళ్యాణ్, అప్పుల మధ్య సరదాగా సంభాషణ జరుగుతుంది. లెటర్ రాసిన అమ్మాయిని పట్టుకోమని అప్పూని అడుగుతాడు కళ్యాణ్. దీనికి అప్పు కూడా సరే అంటుంది. ఆ తర్వాత ఇంట్లో జరిగిన గొడవ కారణంగా సతమతమవుతుంది కావ్య. ఇంటి అప్పు ఎలా తీర్చాలి? అంటూ తనలో తన మదనపడుతుంది. అలాగే అపర్ణ తనని అన్న మాటలను గుర్తు తెచ్చుకుని బాధపడుతుంది. ఈలోపు రాజ్ వస్తాడు. తనని చూసిన కావ్య.. కాఫీ తెమ్మంటారా? అని అడుగుతుంది. రాజ్ ఇప్పుడు అవసరం లేదని చెప్తాడు. నీకు ఓ గుడ్ న్యూస్ చెప్పాలి అంటాడు. నాకా? అని షాక్ అవుతుంది కావ్య. నేను కళను గుర్తించను అంటూంటావు కదా..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కళ్యాణ్, అప్పుల మధ్య సరదాగా సంభాషణ జరుగుతుంది. లెటర్ రాసిన అమ్మాయిని పట్టుకోమని అప్పూని అడుగుతాడు కళ్యాణ్. దీనికి అప్పు కూడా సరే అంటుంది. ఆ తర్వాత ఇంట్లో జరిగిన గొడవ కారణంగా సతమతమవుతుంది కావ్య. ఇంటి అప్పు ఎలా తీర్చాలి? అంటూ తనలో తన మదనపడుతుంది. అలాగే అపర్ణ తనని అన్న మాటలను గుర్తు తెచ్చుకుని బాధపడుతుంది. ఈలోపు రాజ్ వస్తాడు. తనని చూసిన కావ్య.. కాఫీ తెమ్మంటారా? అని అడుగుతుంది. రాజ్ ఇప్పుడు అవసరం లేదని చెప్తాడు. నీకు ఓ గుడ్ న్యూస్ చెప్పాలి అంటాడు. నాకా? అని షాక్ అవుతుంది కావ్య. నేను కళను గుర్తించను అంటూంటావు కదా.. ఇప్పుడు నీ కళకు కావాల్సిన గుర్తింపును తీసుకొచ్చాను అంటాడు రాజ్. ఏంటది అని అడుగుతుంది కావ్య. ఇన్నాళ్లు అర్థరాత్రులు కూర్చొని.. డిజైన్లు గీసేదానికి కదా.. ఇకపై ఆఫీసులో కూర్చొని గీయవచ్చు అంటూ ఆఫర్ లెటర్ ఇస్తాడు రాజ్. దీనికి ఎలాంటి రియాక్షన్ ఇవ్వదు కావ్య. ఏంటి ఎలాంటి రియాక్షన్ లేదు అంటాడు.. ఏమైంది అని అడుగుతాడు రాజ్. నాకు ఆ జాబ్ చేసే అదృష్టం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో ఫైర్ అవుతాడు రాజ్.
తనను పిలుస్తూ.. తన వెనకే వెళ్తుండగా.. బయట ఉన్న ధాన్యలక్ష్మి వింటుంది. తనను చూసి అంతా విన్నారా పిన్ని.. ఎప్పుడూ మీ కోడలికి అన్యాయం చేస్తున్నాను అంటారు కదా.. ఇప్పుడు నేనే జాబ్ ఆఫర్ ఇచ్చినా కాదని వెళ్లిపోయిందని అడుగుతారు. అందులో కావ్య తప్పు లేదంటాను అని ధాన్య లక్ష్మి అనగా.. ఏంటి పిన్ని మీరు అనేది? అని రాజ్ అడుగుతాడు. కావ్య ఉన్న పరిస్థితుల్లో అంతకన్నా ఏం చేయగలదు? అని అంటుంది. ఏమైంది పిన్ని? ఏమైందని రాజ్ అడగ్గా.. ఇంట్లో జరిగిన రచ్చ గురించి అంతా రాజ్ కి చెప్తుంది ధాన్యలక్ష్మి. అదేంటి పిన్ని.. తన పుట్టింట్లో కష్టం ఉందని నాకు నేరుగా తనేం చెప్పలేదు.. నేనే కళ్యాణ్ ని అడిగి తెలుసుకున్నాను. అయినా నేనేం ఊరికే డబ్బులు ఇవ్వలేదే? తను గీసిన డిజైన్స్ కి డబ్బులు ఇచ్చాను అంతే. అప్పటికీ తను ఈ డబ్బు తన పుట్టింటి వాళ్లకు ఇవ్వొచ్చా? అని అడిగింది. నీ డబ్బు నీ ఇష్టం అని చెప్పాను.. దానికి ఇంట్లో ఇంత రాద్దాంతం జరిగిందా? అని షాక్ అవుతాడు రాజ్.
ఇన్ని మాటలు పడ్డా ఏ ఆడపిల్ల అయినా ఏం చేయగలదు రాజ్? సంస్కారం ఉన్న పిల్ల కాబట్టి.. ఇంత జరిగినా నీతో ఏమీ చెప్పలేదు అంటుంది ధాన్య లక్ష్మి. ఈలోపు కిచెన్ లోకి వెళ్లిన కావ్య.. ఇంటికి డబ్బులు ఎలా కట్టాలా అని మదన పడుతుంది. చిరాకుతో తనలో తాను తిట్టుకుంది. ఈలోపు రాజ్.. అపర్ణ దగ్గరకు వెళ్తాడు. మమ్మీ నిన్ను తప్పు పట్టాలని కాదు మమ్మీ.. కానీ విషయం తెలుసుకోకుండా తొందర పడ్డావు అంటాడు రాజ్. తొందర పడ్డానంటున్నావా.. తప్పు చేశానంటున్నావా అని అపర్ణ అడుగుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోవాడనికి ట్రై చేయ్. కళావతి తప్పు చేసినప్పుడు.. నువ్వు తన మీద అరిస్తే ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని రాజ్ చెప్పగా.. అవును రాజ్ మీరు పెద్దవాళ్లు అయిపోయారు కదా.. మీరు చేసేదంతా ఆలోచించి ముందు చూపుతో చేస్తారు. ఇప్పుడు మాకు వయసు అయిపోయింది కదా.. మా ఆలోచనలు కూడా పాతపడిపోయాయి.. అని అపర్ణ అనగా.. అలా అని నేను అన్నానా?.. కళావతి నేను ఇస్తేనే డబ్బు తీసుకెళ్లి వాళ్ల నాన్నకు ఇచ్చింది. అది కూడా తను గీసిన డిజైన్స్ ఇచ్చిన రెమ్యునరేషన్ మాత్రమే అని చెప్తాడు రాజ్.
మమ్మీ నా గురించి నీకు బాగా తెలుసు.. తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టను.. అది కళావతి అయినా సరరే. నేను చెప్పేది నిజం మమ్మీ. తన వల్ల మన కంపెనీకి ఓ ప్రాజెక్ట్ కూడా ఓ అయ్యింది మమ్మీ.. ఇందుకో అందుకే ఈ ఆఫర్ లెటర్ తీసుకొచ్చాను. నీ చేతులతోనే ఈ లెటర్ కూడా ఇప్పిందామని అనుకున్నాను.. కానీ ఈలోపే ఇదంతా జరిగిపోయింది అని అంటాడు రాజ్. ఆ కావ్య నీకు మాయమాటలు చెప్పి.. పుట్టింటికి డబ్బు తీసుకెళ్తుందనే సరికి నాకు కోపం వచ్చేసింది.. అలా చేయాల్సిన అవసరం ఏంటి? అని ఆవేశంలో అరిచేశాను అని చెప్తాడు. సరే మమ్మీ ఇప్పుడు చెప్పు.. నువ్వు ఒప్పుకుంటే తనను మన ఆఫీసులో జాయిన్ చేసుకుంటా.. అని రాజ్ అనగా.. ఓకే అని అపర్ణ చెప్తుంది. దీంతో సంతోషంగా వెళ్తాడు రాజ్.
ఈలోపు కావ్య తన పుట్టింటి కష్టం తీర్చడం కోసం అందరికీ ఫోన్లు చేస్తుంది. ఏమైనా పని ఉంటే చెప్పమని అడుగుతంది. కట్ చేస్తే మళ్లీ రాజ్ వస్తాడు.. మా అమ్మ నువ్వు డిజైనర్ గా పని చేయడానికి ఒప్పుకుంది అని చెప్తాడు.. రేపటి నుంచి నువ్వు ఆఫీసులో జాయిన్ కావచ్చు అని చెప్తాడు. కానీ కావ్య ఒప్పుకోదు. రాజ్ పై రివర్స్ అవుతుంది. నేను ఆయనకి ఇచ్చిన మాట ఎలా కాపాడుకోవాలి అని అడుగుతుంది?, మా పుట్టింటి దోచి పెడుతున్నామని దెప్పిపొడుస్తారు. ఆ మాటలు అన్నీ విని మా అమ్మవాళ్లు తట్టుకోలేరు. ఇలాంటి అవమానాలు, చీత్కారాలు ఏమీ వద్దండి అని అంటుంది. అయినా రాజ్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అయినా కావ్య ఒప్పుకోదు. ఆ తర్వాత మళ్లీ ఇంకొకరికి కాల్ చేయగా.. ఆయన నేను ఆల్ రెడీ పెద్ద కాంట్రాక్ట్ మీ నాన్నకు ఇచ్చాను.. ఆయన చేయలేనని చెప్పారు అని చెప్తాడు. దీనికి కావ్య లేదు.. లేదు మీరు ఆ కాంట్రాక్ట్ మా నాన్నకి ఇవ్వండి నేను చేస్తాను అని చెప్తుంది. అందుకు ఆయన కూడా ఓకే అని చెప్తాడు. దీంతో కావ్య సంతోషంగా ఫీల్ అవుతుంది.
ఈ సీన్ కట్ చేస్తే.. కావ్యని ఇరికించుకున్నందుకు బాగా సంతోషంగా ఫీల్ అవుతుంది స్వప్న. ఆ తర్వాత కావ్య చెప్పిన మా నిజమే.. నా కడుపు గురించి ఆలోచించాలి అంటూ ప్లాన్లు వేస్తుంది. ఈలోగా రాహుల్ తాగేసి వచ్చి.. చాలా సంతోషంగా ఉందంటాడు. ఎందుకు అంటుంది స్వప్న. కావ్యని బాగా ఇరికించావుగా అని చెప్తాడు. దీంతో స్వప్న ఇక నుంచి రాహుల్ తో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ మనసులో మాట్లాడుకుంటుంది. ఐలవ్ యూ బేబీ.. అంటూ రాహుల్ అంటాడు. రాహుల్ మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు.. ఎలాగైనా ఈ అవకాశాన్ని వాడుకోవాలి అంటుంది స్వప్న. ఇక నేటితో ఈ ఎపిపోస్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.