AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ivy Gourd Tips: దొండకాయలా అని వదిలేస్తున్నారా? కానీ దీంతో అద్భుత ప్రయోజనాలున్నాయ్!!

చాలా మంది ఒక అపోహతో దొండకాయలను తినరు. దొండకాయలు తింటే మందబుద్ధి పెరుగుతుందని కొందరి అపోహ. కానీ.. దొండకాయలు తినడం వల్ల చాలా ఆరోగ్య లాభాలున్నాయి. వండుకునే తినక్కర్లేదు. పరగడుపునే 30 ఎంఎల్ దొండకాయ జ్యూస్ తాగినా చాలు. వీటిలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించి.. సుఖ విరేచనం అయ్యేలా చేస్తుంది. ఫలితంగా రోజంతా హ్యాపీగా.. హుషారుగా పనిచేసుకుంటారు. ఇంకా దొండకాయలు తినడం వల్ల..

Ivy Gourd Tips: దొండకాయలా అని వదిలేస్తున్నారా? కానీ దీంతో అద్భుత ప్రయోజనాలున్నాయ్!!
Ivy Gourd Tips
Chinni Enni
|

Updated on: Aug 05, 2023 | 9:25 PM

Share

చాలా మంది ఒక అపోహతో దొండకాయలను తినరు. దొండకాయలు తింటే మందబుద్ధి పెరుగుతుందని కొందరి అపోహ. కానీ.. దొండకాయలు తినడం వల్ల చాలా ఆరోగ్య లాభాలున్నాయి. వండుకునే తినక్కర్లేదు. పరగడుపునే 30 ఎంఎల్ దొండకాయ జ్యూస్ తాగినా చాలు. వీటిలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించి.. సుఖ విరేచనం అయ్యేలా చేస్తుంది. ఫలితంగా రోజంతా హ్యాపీగా.. హుషారుగా పనిచేసుకుంటారు. ఇంకా దొండకాయలు తినడం వల్ల ఏమేం ప్రయోజనాలున్నాయో చూద్దాం.

-దొండకాయల జ్యూస్ ను రోజూ తాగితే.. పేగులు, జీర్ణాశయంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. గ్యాస్ సమస్య తగ్గి.. కడుపులో మంట కూడా తగ్గుతుంది.

-దొండకాయల్లో ఉండే విటమిన్ సి.. చర్మాన్ని సంరక్షించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ వ్యాధుల బారి నుంచి రక్షిస్తుంది.

ఇవి కూడా చదవండి

-వీటిలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. రక్తం అధికంగా తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనత సమస్యకు దొండకాయలు మంచి ఆహారం.

-దొండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ ను నిర్మూలిస్తాయి. అలాగే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు నుంచి కాపాడుతాయి.

-అంతేకాదు.. అధికబరువు ఉన్నవారు దొండకాయలను డైట్ లో తీసుకుంటే.. బరువు కూడా తగ్గుతారు. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.

-రక్తసరఫరా మెరుగు పడుతుంది. వాపులు తగ్గుతాయి. ఇన్ఫెక్షన్లు దరిచేరవు. వారానికి రెండుసార్లైనా దొండకాయ కర్రీ తినడం వల్ల ఇలా ఆరోగ్యపరంగా చాలా మేలు జరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం