Clove Tips: భోజనం తర్వాత ఒక్క లవంగం తింటే.. సూపర్ ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు!!

మనకు వచ్చే అనారోగ్యాలకు సరైన వైద్యం మన వంటి దినుసుల్లోనే ఉంటాయి. జీలకర్ర, సోంపు,  ధనియాలు, దాల్చినచెక్క, లవంగాలు వగైరా దినుసుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు.. వీటిని వాడటం చాలా మంచిది. అందుకే వర్షాకాలం, చలి కాలాల్లో వేడి వేడి పదార్థాలు తినాలంటారు. మరి ఈ రోజు మన వంటింట్లో ఉండే లవంగాలను..

Clove Tips: భోజనం తర్వాత ఒక్క లవంగం తింటే.. సూపర్ ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు!!
Clove Tips
Follow us
Chinni Enni

|

Updated on: Aug 05, 2023 | 7:48 PM

మనకు వచ్చే అనారోగ్యాలకు సరైన వైద్యం మన వంటి దినుసుల్లోనే ఉంటాయి. జీలకర్ర, సోంపు,  ధనియాలు, దాల్చినచెక్క, లవంగాలు వగైరా దినుసుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు.. వీటిని వాడటం చాలా మంచిది. అందుకే వర్షాకాలం, చలి కాలాల్లో వేడి వేడి పదార్థాలు తినాలంటారు. మరి ఈ రోజు మన వంటింట్లో ఉండే లవంగాలను వాడటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.

-సాధారణంగా సుగంధద్రవ్యాల్లో ఒకటైన లవంగాలను నాన్ వెజ్ వంటకాల్లో, బిర్యానీల్లో.. ఇతర మసాలా కూరలు చేసేందుకు వాడుతుంటాం. అయితే వీటిని మసాలాల్లోనే కాదు.. విడిగా తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

-లవంగాలలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, కార్బోహైడ్రేట్లు, హైడ్రాలిక్ యాసిడ్, విటమిన్ ఏ, మాంగనీస్ వంటి పోషకాలు లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

-లవంగాలను కాస్మోటిక్స్ తయారీలో, ఫార్మాస్యూటికల్స్ కు, వ్యవసాయ ఉత్పత్తులకు కూడా ఉపయోగిస్తారు.

-భోజనం తర్వాత.. మూడుపూటలా ఒక్క లవంగం తీసుకుంటే చాలు. జీర్ణవ్యవస్థలో ఏర్పడిన లోపాలు సరి అవుతాయి. పేగులు శుభ్రమవుతాయి. కడుపులో సూక్ష్మజీవుల నుంచి, ఆరోగ్యానికి వివిధ రకాల హాని కలిగించే క్రిముల నుంచి కాపాడుతుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తాయి.

-రోజూ లవంగాన్ని తింటే.. ఈ సీజన్ లో వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.

-ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ తొలిదశలో ఉన్నవారికి లవంగాలు మంచి ఔషధంలా పనిచేస్తాయి.

-షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. వయసురీత్యా ఎముకల్లో వచ్చే సమస్యలను తగ్గించి.. నొప్పులు, వాపులు రాకుండా నివారిస్తాయి.

-దంతాల సమస్యలు, చిగుళ్ల నొప్పి, నోటి దుర్వాసన, కడుపులో వికారం వంటివి కూడా తగ్గుతాయి. చర్మ సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి