Health Tips: వర్షాకాలంలో చేపలు తినొచ్చా? ఆరోగ్య నిపుణులు చెబుతున్న కీలక వివరాలు మీకోసం..
ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, కొన్ని సందర్భాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. సాధారణంగా రుతుపవనాలు.. ఉపశమనం, తాజాదనాన్ని కల్పిస్తాయి. అయితే, అదే సమయంలో నీటి వనరులలో కలుషిత ప్రమాదం మరింత పెరుగుతంది. తద్వారా సముద్రపు ఆహారం ఆరోగ్యానికి హానీ చేసే అవకాశం ఉంది. అందుకే వర్షాకాలంలో సీఫుడ్‌కు..
మీరు మాంసాహారులా? మరి వర్షాకాలంలో చేపలు, ఇతర సీఫుడ్స్ తింటున్నారా? అయితే, ఈ విషయంలో తప్పక జాగ్రత్తగా ఉండాల్సిందేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. చేపలు తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, కొన్ని సందర్భాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. సాధారణంగా రుతుపవనాలు.. ఉపశమనం, తాజాదనాన్ని కల్పిస్తాయి. అయితే, అదే సమయంలో నీటి వనరులలో కలుషిత ప్రమాదం మరింత పెరుగుతంది. తద్వారా సముద్రపు ఆహారం ఆరోగ్యానికి హానీ చేసే అవకాశం ఉంది. అందుకే వర్షాకాలంలో సీఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలను ఓసారి తెలుసుకుందాం..
వర్షాకాలంలో చేపలు తినడం వలన కలిగే 5 దుష్ప్రభావాలు..
కాలుష్య కారకాలు: ఈ సీజన్‌లో తరచుగా వచ్చే వర్షాలు, వరదల కారణంగా నీటి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. వర్షపు నీరు, భూమి నుంచి నదులు, సరస్సుల ద్వారా సముద్రాలలోకి చేరుతాయి. తద్వారా కాలుష్యం కూడా సముద్రంలో ఎక్కువ అవుతుంది. చేపతలు, ఇతర జలచరాలు ఈ కాలుష్య కారకాలను ఆహారంగా తీసుకుంటాయి. అవికాస్తా వాటి శరీరంలో పేరుకుపోతాయి. ఫలితంగా ఈ సీజన్‌లో చేపలు తినడం వలన చేపలు, సీఫుడ్స్‌లోని కాలుష్య కారకాలు మన శరీరంలోకి కూడా ప్రవేశిస్తాయి. దాంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మెర్క్యూరీ పాయిజనింగ్: చేపలు తినడం వల్ల వచ్చే మరో దుష్ప్రభావం మెర్క్యూరీ పాయిజన్(పాదరస విషం). మెర్క్యూరీ ఒక విషపూరితమైన హెవీ మెటల్. ఇది చేపలు, ఇతర సముద్రపు ఆహారంలో ఉంటుంది. ముఖ్యంగా ట్యూనా, స్వోర్డ్ ఫిష్, షార్క్ వంటి చేపల కణజాలాలలో పేరుకుపోతుంది. రుతుపవనాల కారణంగా పాదరసం స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవతాయి. చేపల రకం, పరిమాణం అంశంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. కలుషితమైన చేపలు తినడం వలన కాలక్రమేణా మన శరీరంలో పాదరసం ప్రమాదకరమైన స్థాయికి చేరుతుంది. దీని వలన వణుకు, మూడ్‌లో మార్పులు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, కండరాల బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి.
పర్యావరణ కలుషితాలు: పాదరసంతో పాటు, పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్ (PCBs) వంటి ఇతర పర్యావరణ కాలుష్య కారకాలతో సముద్ర ఆహారం కలుషితమై ఉండే అవకాశం ఉంది. ఇవి చేపల కణజాలాలలో పేరుకుపోయి మనుషులకు ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తాయి.
అలెర్జీ: కొందరికి చేపలు, ఇతర సీఫుడ్స్ వలన అలెర్జీ ఏర్పడే అవకాశం ఉంది. వర్షాకాలంలో ఈ అలెర్జీలు మరింత తీవ్రమవుతాయి. రోగనిరోధక వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుంది. సీఫుడ్స్ అలెర్జీ సమస్యలు తేలికపాటి నుండి తీవ్రమైనవి కూడా ఉండే అవకాశం ఉంది. దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయి. దద్దుర్లు, ముఖం, పెదవులు, నాలుక, గొంతు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గురక, కడుపు నొప్పి, వికారం, వాంతులు అవుతాయి.
అంటువ్యాధులు: వర్షాకాలం నీటి వనరులలో పరాన్నజీవుల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. చేపలు, సముద్రపు ఆహారంలో టేప్‌వార్మ్‌లు, రౌండ్‌వార్మ్‌లు, ఫ్లూక్స్ వంటి పరాన్నజీవులు ఉండవచ్చు. ఇవి మనం తిన్నప్పుడు ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతాయి. ఈ అంటువ్యాధులు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి. కలుషితమైన సీఫుడ్స్ తినడం వలన అతిసారం, ఉబ్బరం, గ్యాస్ ఏర్పడుతుంది. తీవ్రమైన సందర్భాల్లో ఇతర అవయవాలు కూడా ప్రభావితమవుతాయి.
గమనిక: పైన పేర్కొన వివరాలు ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..