AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా? అయితే టైప్-2 డయాబెటీస్ రావడం ఖాయం!

స్పానిష్ శాస్త్రవేత్తల ప్రకారం ఉదయం 8 గంటలలోపు బ్రేక్ ఫాస్ట్ చేసే వారి కంటే.. ఉదయం 9 గంటల తర్వాత అల్పాహారం తినే వారిలో ఎక్కువగా టైమ్-2 మధుమేహం వచ్చే అవకాశం ఉందంట. ఇది 59 శాతం షుగర్ లెవల్స్ ని పెంచుతుందట. ఇక టిఫిన్ ని స్కిప్ చేసేవారైతే.. కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లే అంటున్నారు. అలాగే రాత్రి భోజనం కూడా 7 గంటలలోపు చేయడం ఉత్తమని నిపుణులు

Health Tips: మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా? అయితే టైప్-2 డయాబెటీస్ రావడం ఖాయం!
Diabetes
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 12, 2023 | 6:42 AM

Share

ఉదయం బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తున్నారా? సరైన సమయంలో తినడం లేదా? కానీ ఉదయం టిఫిన్ చేయకపోవడం వల్ల.. ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో మీకు తెలుసా? ఉదయం అల్పాహారం చేయకపోవడం వల్ల డయాబెటీస్ పెరిగే ఛాన్స్ ఉంది. తాజాగా చేసిన పలు అధ్యయనాల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాత్రి భోజనం తర్వాత నుంచి.. ఉదయం వరకు మధ్యలో ఏమీ తినకుండా నిద్రపోతూంటాం. కాబట్టి మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ శరీరానికి చాలా ముఖ్యం. ఉదయం టిఫిన్ చేయకపోతే ఎలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

స్పానిష్ శాస్త్రవేత్తల ప్రకారం ఉదయం 8 గంటలలోపు బ్రేక్ ఫాస్ట్ చేసే వారి కంటే.. ఉదయం 9 గంటల తర్వాత అల్పాహారం తినే వారిలో ఎక్కువగా టైమ్-2 మధుమేహం వచ్చే అవకాశం ఉందంట. ఇది 59 శాతం షుగర్ లెవల్స్ ని పెంచుతుందట. ఇక టిఫిన్ ని స్కిప్ చేసేవారైతే.. కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లే అంటున్నారు. అలాగే రాత్రి భోజనం కూడా 7 గంటలలోపు చేయడం ఉత్తమని నిపుణులు చెబుతున్నారు.

అసలు ఈ టైప్-2 మధుమేహం అంటే ఏంటి?

ఇవి కూడా చదవండి

టైప్-2 డయాబెటీస్ అంటే దీర్ఘకాలిక జీవక్రియ వ్యాధి. ఇది రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ను పెంచుతుంది. శరీరంలో ఇన్సులిన్ లేకపోవడాన్ని చేస్తుంది. ఇది ఎక్కువగా జంక్ ఫుడ్స్ అతిగా తినడం, జీవనశైలి సరిగ్గా లేకపోవడం, స్థూలకాయం కారణంగా వస్తుంది. ఈ డయాబెటీస్ ఒకసారి సోకిన తర్వాత పూర్తిగా నిర్మూలించడం చాలా కష్టం. కాబట్టి సరైన డైట్ ని ఫాలో అవ్వాలి. జీవితంలో బిజీగా ఉండి.. ఆరోగ్యం పై సరైన శ్రద్ధ పెట్టకపోతే ఈ డయాబెటీస్ బాగా ముదిరిపోతుంది. ఆ తర్వాత ఇది ప్రాణాల మీదకు తెస్తుంది.

అందుకే బ్యాలెన్స్ అండ్ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మనం రోజూ తీసుకునే ఆహారంలో బీన్స్, నేరేడు పండ్లు, బ్రోకలీ, జొన్న, యాపిల్, పచ్చి బఠాణి, క్యారెట్ వంటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

ఈ టైప్-2 డయాబెటీస్ లక్షణాలు :

1. దాహం ఎక్కువగా వేయడం 2. ఆకలి పెరగడం 3. తరచుగా మూత్ర విసర్జన చేయడం 4. నోరు తడి ఆరిపోవడం 5. బరువు తగ్గడం 6. అలసట 7. చూపు మసకబారడం 8. తలనొప్పి 9. ఇన్ ఫెక్షన్లకు గురవ్వడం 10. చేతులు, కాళ్ల జదరింపు

పై లక్షణాలు ఏమన్నా కనిపిస్తే వెంటనే వైద్యుల సహాలు తీసుకోవడం ఉత్తమం. వారు మీకు షుగర్ ఉందా? లేదా? అనేది నిర్థారిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి మందులు లేదా జీవన శైలిలో మార్పులు సూచిస్తారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి