AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Macadamia Nuts: రోజుకి నాలుగు తింటే చాలు.. ఎన్నో ఆరోగ్య లాభాలో!!

సాధారణంగా మనకు నట్స్ అనగానే గుర్తొచ్చేవి.. జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా వగైరా ఇలాంటివే కదా. కానీ ఇప్పుడు మనజీవన శైలికి తగ్గట్టుగా మార్కెట్లోకి రకరకాల డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ వచ్చేశాయి. ఆఖరికి పుచ్చగింజల్ని కూడా ఎండబెట్టి, పొట్టుతీసి.. వాటర్ మిలాన్ సీడ్స్ అని అమ్మేస్తున్నారు. మనం కూడా ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారని వాటినే కొనుక్కుని తింటున్నాం. అదే నిజంగా పుచ్చకాయ తినేటపుడు పొరపాటున ఒక్క గింజను కొరికినా కంగారు పడిపోతాం. ఇప్పుడు అసలు విషయానికొస్తే..

Macadamia Nuts: రోజుకి నాలుగు తింటే చాలు.. ఎన్నో ఆరోగ్య లాభాలో!!
Macadamia Nuts Benefits
Chinni Enni
|

Updated on: Aug 04, 2023 | 7:15 PM

Share

సాధారణంగా మనకు నట్స్ అనగానే గుర్తొచ్చేవి.. జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా వగైరా ఇలాంటివే కదా. కానీ ఇప్పుడు మనజీవన శైలికి తగ్గట్టుగా మార్కెట్లోకి రకరకాల డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ వచ్చేశాయి. ఆఖరికి పుచ్చగింజల్ని కూడా ఎండబెట్టి, పొట్టుతీసి.. వాటర్ మిలాన్ సీడ్స్ అని అమ్మేస్తున్నారు. మనం కూడా ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారని వాటినే కొనుక్కుని తింటున్నాం. అదే నిజంగా పుచ్చకాయ తినేటపుడు పొరపాటున ఒక్క గింజను కొరికినా కంగారు పడిపోతాం. ఇప్పుడు అసలు విషయానికొస్తే.. డ్రైనట్స్ అన్నింటిలోకెల్లా మెకడమియా నట్స్ బలమైనవని నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల మెకడమియా నట్స్ లో 740 క్యాలరీల శక్తి ఉంటుందట. ఇది 100 గ్రాముల జీడిపప్పులో లభించేదానికంటే ఎక్కువ.

-మెకడమియా నట్స్ లో శరీరానికి మేలుచేసే కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడుతాయి.

-మెకడమియా నట్స్ లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. గ్లైసమిక్ ఇండెక్స్ కలిగి ఉండే ఈ నట్స్ ను షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా తినొచ్చు. నీరసం, బలహీనత తగ్గించి, శరీరానికి కావలసిన బలాన్నిస్తాయి.

ఇవి కూడా చదవండి

-మెకడమియా నట్స్ ఎక్కువ సమయం ఆకలి లేకుండా చేస్తుంది. ఫలితంగా చిరుతిళ్లు తినాలన్న కోరిక తగ్గి బరువు తగ్గుతారు.

-గర్భిణులు, బాలింతలు, పిల్లలు కూడా ఈ నట్స్ ను రోజూ తినవచ్చు. అధిక రక్తపోటు, పక్షవాతం వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

-రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని కూడా ఈ నట్స్ లో ఉండే పోషకాలు సంరక్షిస్తాయి.

-మెకడమియా నట్స్ ను రోజుకు 4-5 మోతాదులో నానబెట్టినవి తినాలి. పచ్చివి తింటే కడుపునొప్పి రావొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి