Under Arms Tips: జస్ట్ ఈ మూడింటితో చంకల్లో పేరుకున్న నలుపును ఇట్టే పోగొట్టేయచ్చు!!

పైకి కనిపించే ముఖం అందంగా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ఫేషియల్స్, ఫేస్ క్రీమ్స్, మేకప్ లు ఇలా చాలా వాడుతుంటాం. ముఖంపై పేరుకుపోయిన ట్యాన్ ను తొలగించుకునేందుకు రకరకాల చిట్కాలున్నాయి. మరి నల్లగా ఉన్న చంకలు (black under arms) సంగతేంటి ? చంకల్లో పేరుకుపోయిన ట్యాన్ వల్ల అవి నల్లగా మారిపోతాయి. ఫలితంగా నచ్చిన స్లీవ్ లెస్ దుస్తులను ధరించలేం. అందుకు కారణం రసాయనాలు...

Under Arms Tips: జస్ట్ ఈ మూడింటితో చంకల్లో పేరుకున్న నలుపును ఇట్టే పోగొట్టేయచ్చు!!
Dark Under Arms
Follow us
Chinni Enni

|

Updated on: Aug 04, 2023 | 4:23 PM

పైకి కనిపించే ముఖం అందంగా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ఫేషియల్స్, ఫేస్ క్రీమ్స్, మేకప్ లు ఇలా చాలా వాడుతుంటాం. ముఖంపై పేరుకుపోయిన ట్యాన్ ను తొలగించుకునేందుకు రకరకాల చిట్కాలున్నాయి. మరి నల్లగా ఉన్న చంకలు (black under arms) సంగతేంటి ? చంకల్లో పేరుకుపోయిన ట్యాన్ వల్ల అవి నల్లగా మారిపోతాయి. ఫలితంగా నచ్చిన స్లీవ్ లెస్ దుస్తులను ధరించలేం. అందుకు కారణం రసాయనాలు కలిగిన డియోడ్రెంట్ల వాడం కూడా ఒకటి.

-నల్లగా ఉన్న చంకలను కేవలం మూడంటే మూడు పదార్థాలు వాడి.. క్లీన్ చేసుకోవచ్చు. ఆ చిట్కా కోసం కావలసినవి బియ్యం పిండి, కొబ్బరినూనె, నిమ్మరసం.

-ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల బియ్యం పిండి, అర టీ స్పూన్ కొబ్బరినూనె, 2 టీ స్పూన్ల నిమ్మరసం వేసి కలపాలి. దీనిని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత బ్రష్ సహాయంతో చంకల్లో నెమ్మదిగా రాసుకోవాలి. ఈ మిశ్రమం ఆరిపోయాక చల్లటి నీటితో నెమ్మదిగా రుద్దుతూ కడిగేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

-రోజు విడిచి రోజు.. కనీసం వారానికి రెండు రోజులైనా ఇలా చేయడం వల్ల చంకల భాగంలో పేరుకుపోయిన నలుపు, మురికి తొలగి తెల్లగా మారుతాయి. చర్మం కూడా మృదువుగా తయారవుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి