Pregnancy Tips: మీరు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారా.. అయితే ఈ ఫుడ్ తినండి!!

పెళ్లై చాలా కాలం అయినా మీరు ఇంకా గర్భవతి కాలేదా.. మీరు ప్రెగ్నెంట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే మీ ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిందే. మీరు తీసుకోవాల్సిన డైట్ నుండి ఒత్తిడి వరకు చాలా మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. తాజాగా జరిగిన అధ్యయనం ప్రకారం.. గర్భవతి అవ్వాలనుకునే మహిళల ఆహారంలో పలు రకాల మార్పులు చేసుకోవాలి. మీ డైట్ లో మంచి కొవ్వు పదార్థాలు, తృణధాన్యాలు, కూరగాయలు, ఆకు కూరలు, చేపలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆడవారిలో సంతానోత్పత్తిని పెంచవచ్చని..

Pregnancy Tips: మీరు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారా.. అయితే ఈ ఫుడ్ తినండి!!
Pregnancy
Follow us
Chinni Enni

|

Updated on: Aug 04, 2023 | 3:39 PM

పెళ్లై చాలా కాలం అయినా మీరు ఇంకా గర్భవతి కాలేదా.. మీరు ప్రెగ్నెంట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే మీ ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిందే. మీరు తీసుకోవాల్సిన డైట్ నుండి ఒత్తిడి వరకు చాలా మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. తాజాగా జరిగిన అధ్యయనం ప్రకారం.. గర్భవతి అవ్వాలనుకునే మహిళల ఆహారంలో పలు రకాల మార్పులు చేసుకోవాలి. మీ డైట్ లో మంచి కొవ్వు పదార్థాలు, తృణధాన్యాలు, కూరగాయలు, ఆకు కూరలు, చేపలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆడవారిలో సంతానోత్పత్తిని పెంచవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకోండి.

ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్:

హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన పరిశోధనలో ఎక్కువగా ఫ్యాట్స్, జంతు ప్రోటీన్లు, చక్కెర, పిండి పదార్థాలు అత్యధికంగా తీసుకునే వారిలో సంతానోత్పత్తికి మార్గాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు తల్లి కావాలనుకుంటే రోజూ మీ భోజనంలో తాగా పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఫ్యాట్స్ (కొవ్వులు):

ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకున్నా కూడా మంచి ఫలితాలుంటాయని పరిశోధనలో వెల్లడైంది. ఆలీవ్ ఆయిల్, గ్రేప్సీడ్ ఆయిల్, ఆవకాడోలు, ఇన్ ఫ్లమేటరీ-తగ్గించే ఆహారాలు తీసుకోవడం ద్వారా గర్భిణీ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి.

ప్రొటీన్:

మంచి ప్రొటీన్ ఫుడ్ కూడా గర్భాధారణకు హెల్స్ చేస్తుంది. చికెన్, టర్కీ, పంది, గొడ్డు మాంసంలో ఐరన్ అండ్ ప్రొటీన్ ఎక్కువగా లభిస్తాయి. ఇవి తీసుకోవడం ద్వారా గర్భాధారణ సమస్యలతో పోరాడుతుంది.

డైరీ:

తల్లి కావాంలంటే పాలు, పాల పదార్థాలు, పెరువు వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇవి సంతానోత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

కెఫిన్:

మీరు గర్భం ధరించాలని ప్లాన్ చేస్తుంటే.. టీ లేదా కాఫీలను మితంగా తీసుకోవాలి. కేవలం రోజుకు ఒకసారి మాత్రమే తాగాలి. ఎందుకంటే ఇందులో ఉండే కెఫిన్ వల్ల కన్సీవ్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.. కాబట్టి టీ, కాఫీలకు దూరంగా ఉంటే బెటర్.

ఒత్తిడికి దూరంగా ఉండాలి:

తల్లి కావాలనే ప్రయత్నించే మహిళలు ఒత్తిడికి చాలా దూరంగా ఉండాలి. ఒత్తిడికి గురి అవ్వడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో కన్సీవ్ అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి