Black Pepper Tips: అంటువ్యాధులు రాకుండా కాపాడే మిరియాల పులుసు.. ఎలా చేయాలో తెలుసుకోండి!!

సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే.. జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు త్వరగా విజృంభిస్తాయి. అలాగే సైనస్, ఆస్తమా రోగులు కూడా ఇబ్బంది పడుతుంటారు. వైరల్ ఫీవర్లు పెరుగుతాయి. ఫలితంగా.. ఆసుపత్రులకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతుంది. మరి ఇలాంటి సీజన్లో జలుబు, దగ్గు వంటి వ్యాధులు రాకుండా.. మంచి పోషకాలతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల్లో ఒకటి మిరియాలు. వీటివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దగ్గు తగ్గడానికి మిరియాలతో కాచిన పాలను ఎక్కువగా తాగాలని మన పూర్వీకుల కాలం నుంచి చెబుతున్నారు. అలాగే మిరియాలతో పులుసు..

Black Pepper Tips: అంటువ్యాధులు రాకుండా కాపాడే మిరియాల పులుసు.. ఎలా చేయాలో తెలుసుకోండి!!
Black Pepper Tips
Follow us

|

Updated on: Aug 03, 2023 | 5:32 PM

సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే.. జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు త్వరగా విజృంభిస్తాయి. అలాగే సైనస్, ఆస్తమా రోగులు కూడా ఇబ్బంది పడుతుంటారు. వైరల్ ఫీవర్లు పెరుగుతాయి. ఫలితంగా.. ఆసుపత్రులకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతుంది. మరి ఇలాంటి సీజన్లో జలుబు, దగ్గు వంటి వ్యాధులు రాకుండా.. మంచి పోషకాలతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల్లో ఒకటి మిరియాలు. వీటివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దగ్గు తగ్గడానికి మిరియాలతో కాచిన పాలను ఎక్కువగా తాగాలని మన పూర్వీకుల కాలం నుంచి చెబుతున్నారు. అలాగే మిరియాలతో పులుసు కూడా తయారు చేసుకుని తింటే.. అంటు వ్యాధులు రాకుండా ఉంటాయట. మరి ఆ పులుసు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం రండి..

మిరియాల పులుసు తయారీకి కావలసిన పదార్థాలు:

కందిపప్పు – 2 టీస్పూన్లు , మినపప్పు – 1 టీస్పూన్, మిరియాలు – ఒకటిన్నర టీ స్పూన్, ధనియాలు – 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి – 5, మెంతులు – అర టీస్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – తగినంత, ఆవాలు – అర టీ స్పూన్, పసుపు – చిటికెడు, చింతపండు గుజ్జు – 2 టీ స్పూన్లు, అల్లంనూనె – 6 టీ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర – కొద్దిగా.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి.. వేడెక్కాక 1 టీ స్పూన్ అల్లం వేసి వేగించాలి. ఆ తర్వాత అందులో పైన తెలిపిన క్వాంటిటీ ప్రకారం మిరియాలు, ధనియాలు, కందిపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసి బాగా వేయించాలి. ఇప్పుడు మెంతులు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. మంటను ఆర్పివేసి రుచికి సరిపడా ఉప్పును కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లబరిచిన తర్వాత.. కొద్దిగా నీరు కలిపి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ నెక్ట్స్ కడాయిలో 5 టీ స్పూన్ల నూనెను వేడి చేసి.. ఆవాలు వేయించాలి. అనంతరం మెంతులు, ధనియాలు, పసుపు, కరివేపాకు.. ఇంతకముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసి.. పులుసు తయారు అయ్యేందుకు కావలసిన మోతాదులో నీరు పోసి మరగనివ్వాలి. చివరిలో కొత్తిమీర చల్లుకోవాలి. అంతే.. వేడివేడి మిరియాల పులుసు రెడీ. దీనిని అన్నంలో కలుపుకుని తినొచ్చు. లేదా అలాగే తాగేయొచ్చు. ఈ వర్షాకాలంలో ఇలా మిరియాల పులుసు అప్పుడపుడు చేసుకుని తింటే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలు కూడా ఈ పులుసును అన్నంలో తినవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి