Health Precautions: ఈ ఒక్క జ్యూస్ తో థైరాయిడ్ కు చెక్ పెట్టండిలా..!

ఊబకాయంతో బాధపడుతున్నవారిలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య థైరాయిడ్. దీనికి జీవితాంతం మందులు వాడాల్సిందేనా? అనేది ప్రతిఒక్కరికీ తలెత్తే ప్రశ్న. వైద్యులు కూడా ఒక్కోసారి ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేరు. కొందరు వాడాల్సిందే అంటే మరికొందరు జీవితాంతం వాడాల్సిన అవసరం లేదంటారు. మరి థైరాయిడ్ కు శాశ్వత పరిష్కారం ఉందా? అంటే అది మనచేతుల్లోనే.. మనం తినే ఆహారాన్ని బట్టే ఉంటుంది. ముఖ్యంగా జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి..

Health Precautions: ఈ ఒక్క జ్యూస్ తో థైరాయిడ్ కు చెక్ పెట్టండిలా..!
Thyroid
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Aug 12, 2023 | 6:48 AM

ఊబకాయంతో బాధపడుతున్నవారిలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య థైరాయిడ్. దీనికి జీవితాంతం మందులు వాడాల్సిందేనా? అనేది ప్రతిఒక్కరికీ తలెత్తే ప్రశ్న. వైద్యులు కూడా ఒక్కోసారి ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేరు. కొందరు వాడాల్సిందే అంటే మరికొందరు జీవితాంతం వాడాల్సిన అవసరం లేదంటారు. మరి థైరాయిడ్ కు శాశ్వత పరిష్కారం ఉందా? అంటే అది మనచేతుల్లోనే.. మనం తినే ఆహారాన్ని బట్టే ఉంటుంది. ముఖ్యంగా జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఇంకా ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఎలాంటి డైట్ పాటించాలో తెలుసుకుందాం.

-థైరాయిడ్ ఉన్నవారు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు. ఇందులో రెండు రకాల థైరాయిడ్ లు ఉంటాయి. ఒకటి శరీర ఆకృతిని పెంచుతుంది. రెండోది శరీరమే లేకుండా.. అంటే బక్కగా అయ్యేలా చేస్తుంది.

-థైరాయిడ్ ఉన్నవారు ఉదయాన్నే పరగడుపునే వేసుకునే ట్యాబ్లెట్.. 5 గంటల కల్లా వేసుకోవాలి. అప్పుడే దాని ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

-క్యారెట్, బీట్ రూట్, కీర, టమాటా కలిపి చేసిన జ్యూస్ ను పరగడుపునే తాగితే.. థైరాయిడ్ సమస్య తగ్గడంతో పాటు ఊబకాయం కూడా తగ్గుతుంది.

-పైన పేర్కొన్న నాలుగు రకాల కూరగాయల్ని చక్కగా కడిగి వాటి తోలు తీసి, ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. జ్యూస్ కొంచెం ఎక్కువగా రావాలంటే ఒక అర టీ గ్లాసు నీటిని కలుపుకుంటే చాలు.

-ఈ మిశ్రమాన్ని వడగట్టి.. అందులో అరచెక్క నిమ్మరసం కలుపుకుని తాగాలి. ఇలా ప్రతిరోజూ ఈ వెజిటబుల్ జ్యూస్ తాగితే థైరాయిడ్ సమస్యకు కొద్దిరోజుల్లోనే చెక్ పెట్టేయచ్చు.

-కండరాలు కూడా బలంగా తయారవ్వడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. కొన్నిరకాల క్యాన్సర్ల ప్రమాదం నుండి కూడా రక్షిస్తుంది. గర్భిణులు, బాలింతలు కూడా ఈ జ్యూస్ ను నిస్సందేహంగా తాగొచ్చు.

-దానితో పాటు తినే ఆహారపు అలవాట్లలో కొన్నిమార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఇడ్లీలు, దోసెలను తగ్గించి.. వాటి స్థానంలో మొలకెత్తిన విత్తనాలను తినడం అలవాటు చేసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!