Blue Tea Benefits: శంఖుపూల టీని ఎప్పుడైనా తాగారా.. ఈ బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు!!
ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో చిన్న వారి నుంచి పెద్దవారి వరకూ రోగాల బారిన పడుతూనే ఉంటున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా పలు వ్యాధులకు గురవుతున్నారు. చిన్న వయసులోనే డయాబెటీస్, బీపీ, గుండెపోటు వంటి రోగాల బారిన పడి సతమతమవుతున్నారు. అనారోగ్యకరమైన జీవనశైలి, వ్యాయమం చేయకపోవడం, గంటల తరబడి కూర్చీలకే అతుక్కుపోవడం లాంటి చెడు అలవాట్ల వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు. అలాగే ప్రస్తుత జీవనశైలి ప్రకారం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోతే వ్యాధుల బారిన..
ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో చిన్న వారి నుంచి పెద్దవారి వరకూ రోగాల బారిన పడుతూనే ఉంటున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా పలు వ్యాధులకు గురవుతున్నారు. చిన్న వయసులోనే డయాబెటీస్, బీపీ, గుండెపోటు వంటి రోగాల బారిన పడి సతమతమవుతున్నారు. అనారోగ్యకరమైన జీవనశైలి, వ్యాయమం చేయకపోవడం, గంటల తరబడి కూర్చీలకే అతుక్కుపోవడం లాంటి చెడు అలవాట్ల వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు.
అలాగే ప్రస్తుత జీవనశైలి ప్రకారం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోతే వ్యాధుల బారిన పడాల్సిందే. ఈ క్రమంలో బ్లూ టీ చక్కగా పని చేస్తుంది. బ్లూ టీతో ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. యవ్వనాన్ని, వయస్సుకు కనబడకుండా చేయడంలో ఈ బ్లూ టీ అద్భుతంగా పని చేస్తుంది. అసలు ఈ బ్లూ టీ అంటే ఏంటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
బ్లూ టీని ఎలా తయారు చేస్తారు?
స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి ఓ రెండు గ్లాసుల నీళ్లను పోసి బాగా మరిగించాలి. ఇందులో శంఖు పూలను వేసి మరికాసేపు మరిగించాలి. రెండు గ్లాసుల నీళ్లు ఒక గ్లాస్ వచ్చేంత వరకూ మరిగాక.. దించి చల్లార్చాలి. గోరువెచ్చగా ఉన్న దానిలో కొద్దిగా తేనె కలిపి సేవిస్తే సరి. దీన్ని బ్లూ టీ అని పిలుస్తారు.
బ్లూ టీ ప్రయోజనాలు:
1. శుంఖు పూలలో సహజంగానే బరువు తగ్గించే లక్షణాలు ఉంటాయి. ఈ టీ తాగడం వల్ల కొవ్వు కరుగుతుంది. అలాగే ఈ బ్లూ టీ తాగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య నుంచి కూడా ఉపశమనం ఉంటుంది.
2. శంఖు పూలలో అనేక రకాలైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న చెడును తొలగిస్తుంది.
3. ఈ బ్లూ టీ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. వృద్ధాప్య సంకేతాలు తగ్గిస్తాయి. ఇందులోని హైడ్రేటింగ్ ఏజెంట్లు యాంటీ ఏజింగ్ సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి.
4. ఈ టీ వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు జట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తాయి. అలాగే మానసిక స్థితిని కూడా పెంపొందిస్తుంది.
5. శంఖు పూలతో చేసిన టీ తాగడం వల్ల నిద్ర కూడా హాయిగా పడుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి