Black Guava Benefits: నల్లజామకాయలు.. ఇవి తింటే ఏమవుతుందో తెలుసా!!

జామకాయలన్నీ ఆకుపచ్చ లేదా పూర్తిగా పండినవి లేదా కాస్త నిమ్మ పండు రంగులో ఉన్నవే మీరు చూసి ఉంటారు. కొన్ని జామకాయలను కట్ చేసి చూస్తే లోపల గుజ్జు ఎర్రగా ఉంటుంది. కానీ ఈ నల్లజామకాయలు (Black Guava) ఏంటి ? ఇవెక్కడ దొరుకుతాయి ? వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి ? అనే కదా మీకు కలిగిన సందేహాలు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పైకి నల్లగా కనిపించినా లోపల ఎర్రటి రంగులో గుజ్జును కలిగి ఉంటాయి ఈ నల్లజామకాయలు. ఈ చెట్టు ఆకులు, పువ్వులు..

Black Guava Benefits: నల్లజామకాయలు.. ఇవి తింటే ఏమవుతుందో తెలుసా!!
Black Guava Benefits
Follow us

|

Updated on: Aug 01, 2023 | 4:45 PM

జామకాయలన్నీ ఆకుపచ్చ లేదా పూర్తిగా పండినవి లేదా కాస్త నిమ్మ పండు రంగులో ఉన్నవే మీరు చూసి ఉంటారు. కొన్ని జామకాయలను కట్ చేసి చూస్తే లోపల గుజ్జు ఎర్రగా ఉంటుంది. కానీ ఈ నల్లజామకాయలు (Black Guava) ఏంటి ? ఇవెక్కడ దొరుకుతాయి ? వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి ? అనే కదా మీకు కలిగిన సందేహాలు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పైకి నల్లగా కనిపించినా లోపల ఎర్రటి రంగులో గుజ్జును కలిగి ఉంటాయి ఈ నల్లజామకాయలు. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, కాండం కూడా నలుపు రంగులోనే ఉంటాయి.

-మామూలు జామకాయల్లో కంటే నల్ల జామకాయల్లో పోషకాలు మరింత ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

-యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, పీచు పదార్థాలతో పాటు విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలుంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఇవి రక్షిస్తాయి.

ఇవి కూడా చదవండి

-శరీరంలో పోషకాహార లోపం తలెత్తకుండా ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి వృద్ధాప్య ఛాయలు రాకుండా నల్లజామకాయలు సహాయపడుతాయి. అలాగే మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.

-వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఎర్రరక్తకణాలు ఎక్కువగా తయారుచేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారు నల్లజామకాయల్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

-డయాబెటీస్ ఉన్నవారికి మంచి ఔషధం నల్లజామకాయలు. ఇవి షుగర్ ను తగ్గిస్తాయి. బరువు తగ్గడంలోనూ సహాయపడుతాయి. శరీరంలో కొవ్వు కరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి