- Telugu News Photo Gallery National Watermelon Day: When and why National Watermelon Day is celebrated? what is its history? check to know
National Watermelon Day: ఆరోగ్యాన్ని కాపాడే పుచ్చకాయకి కూడా ఓ చరిత్ర.. అదేమిటో ఇప్పుడే తెలుసుకోండి..
National Watermelon Day: అంతరించిపోతున్న జీవజాతులను కాపాడుకునేందుకు భారత్‌తో పాటు అనేక దేశాలు పులుల దినోత్సవం, చిలుకల దినోత్సవం.. ఆఖరికీ గబ్బిలాల దినోత్సవం కూడా జరుపుకుంటున్నాయి. ఇంకా పండ్లకు, కూరగాయలకు కూడా దినోత్సవాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 3వ తేదీని జాతీయ పుచ్చకాయ దినోత్సవంగా ప్రపంచ దేశాలు కొన్ని జరుపుకుంటున్నాయి.
Updated on: Aug 03, 2023 | 1:09 PM

National Watermelon Day: మీరు విన్నది నిజమే..! భారత్ సహా ప్రపంచంలోని కొన్ని దేశాలు జాతీయ పుచ్చకాయ దినోత్సవాన్ని ఈ రోజున అంటే ఆగస్టు 3న జరుపుకుంటున్నాయి.

అయితే పుచ్చకాయ దినోత్సవం వెనుక ఉన్న నేపథ్యం, ప్రారంభ సంవత్సరం వంటి వివరాలు పూర్తిగా తెలియరాలేదు.

ఇక పుచ్చకాయ చరిత్ర విషయానికి వస్తే.. పుచ్చకాయను మొదటిసారిగా 5000 సంవత్సరాల క్రితమే ఈజిప్టులో పండించినట్లు చరిత్ర చెబుతోంది. ఇంకా ఇందుకు సంబంధించిన పలు ఆధారాలు కూడా 12వ శతాబ్దంలోనే ఈజిప్ట రాజు టుటంఖమున్(Tutankhamun) సమాధిలో లభ్యమయినట్లు ఆ దేశ చరిత్ర చెబుతోంది.

ఏదేమైనప్పటికీ పుచ్చకాయలో మానవ శరీరానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఫలితంగా మన ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఇంకా ఆనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

పుచ్చకాయలో దాదాపు 95 శాతం నీరు, ప్రోటీన్, జీర్ణ వ్యవస్థకు అవసరమైన ఫైబర్, కంటి ఆరోగ్యానికి కావాల్సిన కెరోటిన్, రోగనిరోధక శక్తిని పెంపొందించే విటమిన్ సి, ఎముకలను పటిష్టం చేసే కాల్షియం, ఫాస్పరస్.. రక్తహీనతను తగ్గించే ఐరన్, గుండెను కాపాడే పొటాషియం వంటి పలు రకాల పోషకాలు నిండుగా ఉంటాయి.





























