AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: వర్షాకాలంలో పొరపాటున కూడా ఈ కూరగాయలు తినొద్దు.. ప్రమాదకరమైన పురుగు మెదడుకు చేరుతుంది..!

కొన్ని కూరగాయలు మాత్రం ఆరోగ్యంతో పాటు.. ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. అందుకే వీటిని జాగ్రత్తగా తినాల్సి ఉంటుంది. కారణం.. వీటిల్లో హానీకరమైన, ప్రమాకరమైన టేప్‌వార్మ్‌లు ఉండటమే. ఈ చిన్న పురుగులు ప్రాణాంకంగా ఉంటాయి. వీటి లార్వా వేడి నీటిలో కూడా జీవించగలదు. ఇవి కూరగాయలలో ఉండటం, వాటిని తినడం వలన రక్తం ద్వారా మెదడుకు చేరుతాయి.

Health Tips: వర్షాకాలంలో పొరపాటున కూడా ఈ కూరగాయలు తినొద్దు.. ప్రమాదకరమైన పురుగు మెదడుకు చేరుతుంది..!
Vegetables
Shiva Prajapati
|

Updated on: Aug 05, 2023 | 8:12 AM

Share

Tapeworms: కూరగాయలు తినడం ఆరోగ్యానికి ప్రయోజనకరం అంటారు. అందుకే ప్రజలు కూడా సీజన్‌కు తగ్గట్లుగా రకరకాల కూరగాయలను తింటారు. అయితే, కొన్ని కూరగాయలు మాత్రం ఆరోగ్యంతో పాటు.. ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. అందుకే వీటిని జాగ్రత్తగా తినాల్సి ఉంటుంది. కారణం.. వీటిల్లో హానీకరమైన, ప్రమాకరమైన టేప్‌వార్మ్‌లు ఉండటమే. ఈ చిన్న పురుగులు ప్రాణాంకంగా ఉంటాయి. వీటి లార్వా వేడి నీటిలో కూడా జీవించగలదు. ఇవి కూరగాయలలో ఉండటం, వాటిని తినడం వలన రక్తం ద్వారా మెదడుకు చేరుతాయి. తద్వారా అనేక వ్యాధులకు దారితీస్తాయి. అవి జీర్ణ వ్యవస్థకు కూడా చాలా ప్రమాదకరం. మరి ఈ పురుగులు ఏ కూరగాయల్లో ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ కూరగాయలలో పురుగులు ఉంటాయి..

1. కాలీఫ్లవర్, క్యాబేజీ: నివేదికల ప్రకారం.. పచ్చి కూరగాయలలో టేప్‌వార్మ్‌లు ఉండవచ్చు. ఇవి మనిషుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాలీఫ్లవర్, క్యాబేజీల్లో ఈ పురుగులు ఎక్కువగా ఉంటాయి. చాలా చిన్నగా ఉండటం కారణంగా కళ్లకు కనిపించవు. కాలీఫ్లవర్ లోపల దాక్కుంటాయి. అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా ఇవి జీవిస్తాయి. ఈ పురుగులు రక్తం ద్వారా మెదడుకు చేరి లార్వాలను జమ చేయగలవు. ఈ కారణంగా మెదడు, కాలేయం, కండరాలలో ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి.

2. వంకాయ: వంకాయ చాలా మందికి ఇష్టమైన కూరగాయ. అయితే వంకాయలో కూడా టేప్‌వార్మ్ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. ఈ పురుగులు ఎక్కువగా వంకాయ గింజల్లో ఉంటాయి. వాటిని తినడం ద్వారా అవి నేరుగా మెదడుకు చేరుతాయిని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే వంకాయను బాగా ఉడికించిన తరువాతే తినాలి.

3. క్యాప్సికమ్: రుచిలో అసమానమైన క్యాప్సికమ్‌లలో కూడా టేప్‌వార్మ్‌లు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు క్యాప్సికమ్‌లోనే లార్వాలను విడుదల చేస్తాయి. దీన్ని తిన్నప్పుడు రక్తం ద్వారా మెదడుకు చేరి అనారోగ్యానికి గురిచేస్తుంది. అందుకే క్యాప్సికమ్‌ను కూడా బాగా ఉడికించాలి.

4. దోసకాయ: దొండకాయలో కూడా టేప్‌వార్మ్‌లు ఉంటాయి. వీటిల్లో కూడా లార్వా ఉంది. వీటిని బాగా ఉడికించిన తరువాత తినాలి. లేదంటే ఇందులో గింజలు తీసేసి తినాలి.

5. దొండకాయ: టేప్‌వార్మ్‌లు దొండకాయలోనూ ఉంటాయి. దొండకాయల్లో రకాలు కూడా ఉంటాయి. పెద్ద సైజు కాయల్లో ఎక్కువ టేప్‌వార్మ్స్‌ ఉండే అవకాశం ఉంది. అందుకే వీటిని తినేముందు బాగా ఉడికించాల్సిన అవసరం ఉంది.

6. కోలోకాసియా ఆకులు: చాలా మంది ప్రజలు ఈ ఆకులను కూరగా వండుకుని తింటారు. అయితే, ఈ ఆకుల్లోనూ టేప్‌వార్మ్ ఉంటుంది. అయితే, దీనిని వండటానికి ముందు వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. బాగా ఉడికించాలి.

మెదడులో పురుగు చేరితే వచ్చే సంకేతాలు..

1. ఆకస్మిక, నిరంతర తలనొప్పి.

2. వికారం, వాంతులు.

3. తీవ్రమైన ఇబ్బంది.

4. శరీరంపై నియంత్రణ కోల్పోవడం

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏమైనా సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..