Urinary Infection: యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా.. అయితే లైంగిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి!!
మూత్రాశయ ఇన్ఫెక్షన్ (Urinary Tract Infection).. వర్షాకాలంలో వేధించే అనారోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. చాలామంది ఈ సమస్యతో బాధపడుతుంటారు కానీ.. అది మూత్రాశయంలో ఇన్ఫెక్షనే అని తెలుసుకోలేరు. మూత్రవిసర్జన చేసే సమయంలో మూత్రనాళం ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. క్రమంగా అది పెరిగినపుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. పొత్తి కడుపులో నొప్పి, తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి ఉండటం, మూత్ర విసర్జన సమయంలో..
మూత్రాశయ ఇన్ఫెక్షన్ (Urinary Tract Infection).. వర్షాకాలంలో వేధించే అనారోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. చాలామంది ఈ సమస్యతో బాధపడుతుంటారు కానీ.. అది మూత్రాశయంలో ఇన్ఫెక్షనే అని తెలుసుకోలేరు. మూత్రవిసర్జన చేసే సమయంలో మూత్రనాళం ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. క్రమంగా అది పెరిగినపుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. పొత్తి కడుపులో నొప్పి, తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి ఉండటం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మంట, జ్వరం, వాంతులు, మానసిక ఆందోళన, తలతిరిగినట్టుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగు చికిత్స చేయించుకోవడం మంచిది. లేదంటే దానిప్రభావం మూత్రపిండాలపై పడే ప్రమాదం లేకపోలేదు. మూత్రాశయ ఇన్ఫెక్షన్ (Urinary Tract Infection)తో బాధపడేవారు కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా దాని నుంచి బయటపడొచ్చు.
-మూత్రాశయ ఇన్ఫెక్షన్ తో బాధపడేవారు కాన్ బెర్రీజ్యూస్ ను తాగడం మంచిది. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, ఫ్లేవనాయిడ్స్, ఆంథోసైనిన్స్ ఇన్ఫెక్షన్ ను తగ్గించడంలో సహాయపడుతాయి.
-శతావరి.. ఈ పేరును వినే ఉంటారు. ఈ మొక్కవేరును పొడి చేసి.. దానిని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే మూత్రాశయంలో వచ్చిన ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఆయుర్వేదం షాపుల్లో శతావరి వేరు పొడి దొరుకుతుంది.
-మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఉన్నవారు నీరు ఎక్కువగా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకి కనీసం 10 -15 గ్లాసుల నీటిని తాగాలి. అలాగే కొబ్బరినీళ్లు కూడా ఎక్కువగా తాగుతుండాలి.
-బార్లీ నీళ్లు మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ను నివారించడంలో చక్కగా పనిచేస్తాయి. వేయించిన బార్లీ గింజలను నీటిలో వేసి కాచి.. ఆ గింజలతో కలిపి రోజూ ఉదయాన్నే సేవిస్తే.. ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గుతుంది.
-దంపతుల్లో ఎవరికి మూత్రాశయ ఇన్ఫెక్షన్ ఉన్నా.. అది తగ్గేంతవరకూ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనకపోవడం మంచిది. అలాగే మూత్ర విసర్జన అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి