Wait Loss Drink: రోజూ రెండుసార్లు ఈ డ్రింక్ తాగండి.. నెలకు 4 కేజీలు ఈజీగా తగ్గండి!

వెయిట్ లాస్.. నూటికి 70 శాతం మంది దీనికోసం పోరాడుతున్నారు. జిమ్ లు, రకరకాల డైట్ లను పాటించడంతో పాటు.. కొన్నిరకాల మెడిసిన్లు కూడా వెయిట్ లాస్ కు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నేచురల్ వెయిట్ లాస్ పేరుతో.. కొన్నిరకాల షేక్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. డైట్ వరకూ ఓకే కానీ.. బరువు తగ్గడానికి మందులు వాడటం, మార్కెట్లలో వచ్చే షేక్స్ తాగడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. బరువు ఎంత వేగంగా పెరుగుతామో.. తగ్గడానికి అంతకి మూడు నాలుగింతల సమయం ఖచ్చితం..

Wait Loss Drink: రోజూ రెండుసార్లు ఈ డ్రింక్ తాగండి.. నెలకు 4 కేజీలు ఈజీగా తగ్గండి!
Flax Seeds Benefits
Follow us
Chinni Enni

|

Updated on: Aug 03, 2023 | 8:20 PM

వెయిట్ లాస్.. నూటికి 70 శాతం మంది దీనికోసం పోరాడుతున్నారు. జిమ్ లు, రకరకాల డైట్ లను పాటించడంతో పాటు.. కొన్నిరకాల మెడిసిన్లు కూడా వెయిట్ లాస్ కు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నేచురల్ వెయిట్ లాస్ పేరుతో.. కొన్నిరకాల షేక్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. డైట్ వరకూ ఓకే కానీ.. బరువు తగ్గడానికి మందులు వాడటం, మార్కెట్లలో వచ్చే షేక్స్ తాగడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. బరువు ఎంత వేగంగా పెరుగుతామో.. తగ్గడానికి అంతకి మూడు నాలుగింతల సమయం ఖచ్చితంగా పడుతుంది. పెరిగినంత ఈజీగా బరువు తగ్గడం చాలా కష్టం. సులభంగా బరువు తగ్గాలనుకునేవారు ఇప్పుడు చెప్పే వెయిట్ లాస్ డ్రింక్ ను ఎలాంటి అనుమానం లేకుండా మీ డైట్ లో చేర్చుకోవచ్చు.

ఈ డ్రింక్ తయారు చేసుకోవడానికి ముఖ్యంగా కావలసినవి:

అవిసె గింజలు, ధనియాలు, రెండు యాలకులు, ఒక నిమ్మకాయ, తేనె.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

-ముందుగా ఒకటిన్నర గ్లాస్ నీళ్లను వేడి చేసి.. 1/2 టీ స్పూన్ అవిసె గింజలు, ఒక స్పూన్ ధనియాలు, కచ్చా పచ్చాగా దంచిన రెండు యాలకులు వేయాలి. అవన్నీ నీటిలో మరుగుతూ ఉండగా.. ఒక నిమ్మకాయను గుండ్రని ముక్కలుగా తరిగి వేయాలి.

-ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసు నీరు అయ్యేంతవరకూ మరిగించాలి. ఈ తర్వాత ఒక గ్లాస్ లో నీటిని వడగట్టుకుని ఒక స్పూన్ తేనె కలిపి గోరువెచ్చగా ఉండగానే తాగాలి. ఉదయం పరగడుపున, రాత్రి ఆహారం తిన్నతర్వాత ఈ పానీయాన్ని రోజుకు రెండుగ్లాసులు తాగితే సులభంగా బరువు తగ్గొచ్చు.

-ఉదయం, రాత్రికి కలిపి ఒకేసారి ఈ పానీయాన్ని తయారు చేసుకోవచ్చు. రాత్రివేళ తాగేముందు సన్నని మంటపై వేడిచేసి తాగితే సరిపోతుంది. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు తేనెను తీసుకోకపోవడం చాలా మంచిది.

-శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో అవిసెగింజలు సహాయపడుతాయి. అలాగే ధనియాలు కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి. యాలకులు మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంతో పాటు.. చిరుతిళ్లు తినాలన్న కోరికలను తగ్గిస్తాయి. నిమ్మకాయలో ఉండే పులుపు (విటమిన్ సి) శరీరానికి ఇమ్యూనిటీని ఇస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి