Gas Problem: గర్భధారణ సమయంలో గ్యాస్ సమస్య తగ్గాలంటే ఏం చేయాలి? ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం

ప్రతి స్త్రీలు గర్భధారణ సమయంలో మూడ్ స్వింగ్స్ నుంచి గ్యాస్‌ల వరకు అనేక చిన్నపాటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. గర్భధారణ సమయంలో కొంతమంది మహిళలు గ్యాస్ సమస్యలతో ఎక్కువగా బాధపడుతుంటారు. ఇది సాధారణమే అయినప్పటికీ, ఇది తరచుగా జరిగితే సమస్య మరింతగా పెరుగుతుంది. కానీ గర్భిణీ స్త్రీలు కొన్ని హోం రెమెడీస్ పాటించడం ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆ పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందాం.. గర్భధారణ సమయంలో గ్యాస్‌ సమస్య ఎందుకస్తుంటుందని..

Gas Problem: గర్భధారణ సమయంలో గ్యాస్ సమస్య తగ్గాలంటే ఏం చేయాలి? ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం
Pregnancy
Follow us
Subhash Goud

|

Updated on: Aug 03, 2023 | 8:05 PM

ప్రతి స్త్రీలు గర్భధారణ సమయంలో మూడ్ స్వింగ్స్ నుంచి గ్యాస్‌ల వరకు అనేక చిన్నపాటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. గర్భధారణ సమయంలో కొంతమంది మహిళలు గ్యాస్ సమస్యలతో ఎక్కువగా బాధపడుతుంటారు. ఇది సాధారణమే అయినప్పటికీ, ఇది తరచుగా జరిగితే సమస్య మరింతగా పెరుగుతుంది. కానీ గర్భిణీ స్త్రీలు కొన్ని హోం రెమెడీస్ పాటించడం ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆ పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందాం..

గర్భధారణ సమయంలో గ్యాస్ సమస్య ఎందుకు ఎక్కువ?

గర్భధారణ సమయంలో గ్యాస్‌ సమస్య ఎందుకస్తుంటుందని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. వైద్యులు వివరాల ప్రకారం.. గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు మహిళల శరీరంలోని జీర్ణ గ్రంధులను సాధారణం కంటే ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఈ కారణంగా శరీరంలో గ్యాస్‌ సమస్య అధికమవుతుంది.

ఇంటి నివారణలు ఏమిటి?

  • ద్రవం లేదా నీటిని తీసుకోవడం పెంచండి. గర్భధారణ సమయంలో శరీరంలో తగినంత నీరు ఉంటే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అందుకే డాక్టర్ సలహా మేరకు గరిష్టంగా నీరు తాగడం మంచిది.
  • గర్భిణీ స్త్రీకి కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ సమస్య అనిపిస్తే నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి. శారీరకంగా హుషారుగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ హెల్తీగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • గర్భిణీ స్త్రీలు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని అనుసరించాలి. కానీ చాలా ఫైబర్ మలబద్ధకం కలిగిస్తుంది. డాక్టర్ సలహా మేరకు డైట్ ప్లాన్ పాటించండి.
  • కొన్నిసార్లు ఒత్తిడి వల్ల కూడా శరీరంలో గ్యాస్ ఏర్పడుతుంది. మూడ్ స్వింగ్స్ కాకుండా, గర్భం కూడా ఒత్తిడిని తెస్తుంది. అయితే అలాంటి సమయంలో గర్భిణీ స్త్రీలు ఒత్తిడిని తగ్గించుకోవడానికి శ్వాస వ్యాయామాలు చేయాలి. ఇది శారీరకంగానే కాకుండా మానసికంగా ఉండేందుకు సహాయపడుతుంది.
  • ఒత్తిడి వల్ల శరీరంలో గ్యాస్ సమస్య కూడా వస్తుందని చాలా నివేదికలు ఉన్నాయి. మూడ్ స్వింగ్స్ కాకుండా, గర్భం కూడా ఒత్తిడిని తెస్తుంది. గర్భిణీ స్త్రీలు ఒత్తిడిని తగ్గించుకోవడానికి శ్వాస వ్యాయామాలు చేయవచ్చు. ఈ వ్యాయామం చేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి