Home Remedies: ఈ చెట్టు బెరడును అరగదీసి రాస్తే.. అన్ వాంటెడ్ హెయిర్ అనేదే ఉండదు
అవాంఛిత రోమాలు (Unwanted Hair).. ఈ రోజుల్లో వయసుకొచ్చిన ఆడపిల్లల్లో ప్రధానంగా కనిపిస్తున్న సమస్య. పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోవడం, గర్భసంచికి నీటిబుడగలు ఉండటం, థైరాయిడ్ ఇలా రకరకాల కారణాల వల్ల చెంపలు, గడ్డం, ఛాతీ, నడుము భాగాలలో ఆడవాళ్లకు అవాంఛిత రోమాలు పెరుగుతుంటాయి. వాటిని ఎలాగైనా శాశ్వతంగా వదిలించుకోవాలని నానా తంటాలు పడుతుంటారు. మార్కెట్లలోకి వచ్చిన లేసర్ ట్రీట్మెంట్ కి లక్షలు వెచ్చించినా..
అవాంఛిత రోమాలు (Unwanted Hair).. ఈ రోజుల్లో వయసుకొచ్చిన ఆడపిల్లల్లో ప్రధానంగా కనిపిస్తున్న సమస్య. పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోవడం, గర్భసంచికి నీటిబుడగలు ఉండటం, థైరాయిడ్ ఇలా రకరకాల కారణాల వల్ల చెంపలు, గడ్డం, ఛాతీ, నడుము భాగాలలో ఆడవాళ్లకు అవాంఛిత రోమాలు పెరుగుతుంటాయి. వాటిని ఎలాగైనా శాశ్వతంగా వదిలించుకోవాలని నానా తంటాలు పడుతుంటారు. మార్కెట్లలోకి వచ్చిన లేసర్ ట్రీట్మెంట్ కి లక్షలు వెచ్చించినా ఫలితం ఉండటం లేదు. తగ్గినట్టే తగ్గి కొన్నాళ్లకు మళ్లీ అవాంఛిత రోమాలు పెరుగుతున్నాయి. అలాంటి బాధితులెందరో ఉన్నారు.
*అవాంఛిత రోమాలు తగ్గాలంటే.. తినే ఆహారంలో మార్పులు అవసరం. మొలకెత్తిన విత్తనాలు, ఇంట్లో తయారు చేసుకున్న వెజిటబుల్ జ్యూస్, పండ్లరసాలను తీసుకుంటూ.. సరైన డైట్ పాటిస్తే రుతుక్రమం (periods) సక్రమమై.. క్రమంగా అవాంఛిత రోమాలు కూడా రాలిపోతాయి.
*అవాంఛిత రోమాలను తొలగించుకునేందుకు ఓ మంచి ఇంటి చిట్కా ఉంది. అదే జమ్మిచెట్టు బెరడు. దసరా పర్వదినం సమయంలో ఈ చెట్టు ఆకులను పూజించి.. ఒకరికొకరు ఇచ్చుకుంటారు. గుర్తొచ్చింది కదూ.. జమ్మి చెట్టు.
*జమ్మిచెట్టు బెరడును తీసుకుని.. సానపై కొద్దిగా నీరు చల్లి అరగదీయాలి. అలా తీసిన ముద్దను అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో రాసుకోవాలి. దానిలో కొద్దిగా పచ్చిపసుపు కొమ్మును కూడా అరగదీసి రాసుకుంటే ఇంకా మంచిది.
*అది ఆరిపోయాక.. కొద్దిగా నీరు చల్లి చేతితో రుద్దుతూ.. మంచినీటితో కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే.. కొద్దిరోజులకే అవాంఛిత రోమాలు పూర్తిగా రాలిపోతాయి. మళ్లీ జీవితంలో రావు. ఇది మన బామ్మల కాలంనాటి చిట్కా. ట్రై చేసి చూడండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి