Viral Video: ఆవు ముందు పడగ విప్పిన పాము.. ఏం చేసిందో చూడండి!!

ఆవు-పాముల మధ్య స్నేహం కనిపించింది.  17 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో గోధుమరంగులో ఉన్న ఆవు.. దాని ముందు పడగవిప్పి ఉన్న పాము.. చూడగానే ఆ పాము ఆవుని కాటేస్తుందేమో అనుకుంటాం కానీ.. అవి రెండు ఎంతో చక్కగా సంభాషించుకుంటున్నాయి. ఎదురుగా ఒక విషజంతువు ఉందన్న జంకు గొంకు ఆ ఆవులో అస్సలు కనిపించదు. పాముకూడా పడగవిప్పి మాట్లాడుతున్నట్టే..

Viral Video: ఆవు ముందు పడగ విప్పిన పాము.. ఏం చేసిందో చూడండి!!
Cow And Snake
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Aug 12, 2023 | 6:46 AM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్ని లక్షల రీల్స్, వీడియోలు వస్తుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు మాత్రం అందరినీ ఆకర్షిస్తాయి. అసలు ఎక్కడా చూడని వింతలు-విశేషాలు.. సోషల్ మీడియా చూపిస్తోంది. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో ఈ వీడియో ఒకటి.

సాధారణంగా.. పాము అంటేనే విషజంతువు. దానిని చూస్తే.. ఆమడదూరం పారిపోవాల్సిందే. జస్ట్ ఇలా కాటేస్తే.. అలా ప్రాణం పోతుంది. తన ప్రాణాన్ని కాపాడుకునేందుకు పాము ముందుగానే.. పడగవిప్పి బుసలు కొడుతూ భయపెడుతుంది. ప్రాణానికి ముప్పు ఉందని తెలిస్తే అస్సలు వదిలి పెట్టదు. అంతటి విషాన్ని నిలువెల్లా కలిగి ఉన్న పాముల్లో కూడా కొన్ని మంచి పాములుంటాయని ఇలాంటి వీడియోలు చూస్తే అనిపించకమానదు.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ఇందులో ఆవు-పాముల మధ్య స్నేహం కనిపించింది.  17 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో గోధుమరంగులో ఉన్న ఆవు.. దాని ముందు పడగవిప్పి ఉన్న పాము.. చూడగానే ఆ పాము ఆవుని కాటేస్తుందేమో అనుకుంటాం కానీ.. అవి రెండు ఎంతో చక్కగా సంభాషించుకుంటున్నాయి. ఎదురుగా ఒక విషజంతువు ఉందన్న జంకు గొంకు ఆ ఆవులో అస్సలు కనిపించదు. పాముకూడా పడగవిప్పి మాట్లాడుతున్నట్టే ఉంటుంది తప్ప.. దానితో పోరాడేందుకు వచ్చినట్టుగా ఉండదు.

ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 4 లక్షల మందికి పైగా వీక్షించగా.. 6 వేలకు పైగా లైక్ లు, 1000కి పైగా రీ ట్వీట్లను పొందింది. ఈ వీడియోపై కొందరు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్.. ‘నేటి ప్రపంచంలో, మానవత్వం అనేది వీటి నుంచి నేర్చుకోవాలి’ అని కామెంట్ చేయగా..  ‘ఆవు -పాము రెండింటి సంభాషణ వివరించలేనిది’ ఇది మానవ అవగాహనకు మించినది’ అని మరొకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి