AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కా మీ కోసమే

సరైన వ్యాయామం లేకపోవడం వల్ల చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఫలితం మాత్రం చాలా తక్కువగా ఉంది. కొద్దిమంది మాత్రమే బరువు తగ్గుతున్నారు. ఒకవేళ తగ్గినా కూడా అది కూడా తాత్కాలికంగానే ఉంటుంది. ఇందుకోసమే ఓ చిట్కా ఉంది. దీన్ని అనుసరిస్తే బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కా మీ కోసమే
Weight Lose
Aravind B
|

Updated on: Aug 05, 2023 | 7:49 PM

Share

ఈ మధ్య కాలంలో బరువు ఎక్కువగా ఉండటం అనేది సర్వసాధారాణం అయిపోయింది. ఇప్పిటికే చాలావరకు మన జీవన శైలీ మారిపోయింది. అలాగే ఆహారపు అలావాట్లు కూడా చాలా వరకు మారిపోయాయి. ముఖ్యంగా ఈ కాలంలో ఇంట్లో చేసిన ఆహారం కంటే.. బయటవే ఎక్కువగా తినాల్సి వస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే కొంతమంది వ్యాయామం చేస్తుంటే మరికొందరు మాత్రం దానికి దూరంగా ఉంటున్నారు. సరైన వ్యాయామం లేకపోవడం వల్ల చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఫలితం మాత్రం చాలా తక్కువగా ఉంది. కొద్దిమంది మాత్రమే బరువు తగ్గుతున్నారు. ఒకవేళ తగ్గినా కూడా అది కూడా తాత్కాలికంగానే ఉంటుంది. ఇందుకోసమే ఓ చిట్కా ఉంది. దీన్ని అనుసరిస్తే బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వాస్తవానికి చాలామంది ప్రొద్దున లేచి కాఫీ లేదా టీ తాగుతారు. అసలు అది తాగనిదే కొంతమందికి రోజు కూడా గడవదు. ఒకవేళ ప్రొద్దున కుదరకపోయినా కూడా మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రికి అయినా తాగుతారు. అయితే వీటిని పరిమితంగా తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇక బరువు తగ్గాలంటే ఇది పాటించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ మనం తాగే కాఫీలో పావుస్పూన్ దాల్చిన చెక్క పొడి.. ఓ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనే బాగా కలపాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం ఈ కాఫీని తాగడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. అలాగే మనం తీనే ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుంది. క్యాలరీలు కరిగిపోయి.. వేగం పెరుగుతుంది. దీంతో బరువు తగ్గుతారు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడితే మలబద్దకం లాంటి సమస్యలు కూడా దరిచేరవు.

ఇవి కూడా చదవండి

ఇలాంటి కాఫీ తాగడం వల్ల బరువు తగ్గే ప్రయోజనం మాత్రమే కాదు.. మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఒత్తిడి, తలనొప్పి లాంటి సమస్యలు ఉండవు. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది. దీంతో చాలామంది సలభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాక ఉదయం పూట వేడినీళ్లు తాగడం వల్ల కూడా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. మరో ముఖ్యవిషయం ఏంటంటే కాఫీని కూడా ఎప్పుడూ పరిమితంగానే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అధికంగా తీసుకుంటే రక్తపోటు కూడా పెరుగుతుందని.. అలాగే నిద్రలేమి సమస్యలు కూడా వెంటాడుతాయని చెబుతున్నారు. అలాగే ప్రతిరోజూ ఎక్కువగా కెఫిన్ తీసుకునే మహిళలకు బ్రెస్ట్ డిసీజ్ కూడా వచ్చే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది.