Telangana: ఎన్నికల వరకు చక్కర తినొద్దు.. పార్టీ కార్యకర్తలకు బీజేపీ లీడర్ సూచన. ఎందుకంటే..
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరో ఆరు నెలలో యుద్ధభేరీ మోగనుంది. దీంతో అధికార పార్టీ మొదలు ప్రతి పక్షాల వరకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వరుసగా కీల నిర్ణయాలు తీసుకుంటూ దూకుడు పెంచుతుంటే.. కాంగ్రెస్, బీజేపీలో అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే పార్టీ క్యాడర్‌తో నిత్యం టచ్‌లో ఉంటూ వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేత ఒకరు కార్యకర్తలకు వింత సూచన చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆయన తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ. వచ్చే ఎన్నికల్లో కాషాయ పార్టీ నుంచి పోటీ చేయడానికి కసరత్తు...

ఎన్నికల్లో గెలవాలంటే ఏం చేయాలి.? కార్యకర్తలు మొదలు నాయకుల వరకు కష్టపడి పని చేయాలి, బూత్ లెవల్ వరకు పార్టీని బలోపేతం చేయాలి, నిత్యం ప్రజల్లో ఉంటూ.. పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి. ఎవరైనా చెప్పే సమాధానం ఇదే. అయితే తెలంగాణ చెందిన ఓ బీజేపీ నాయకుడు మాత్రం ఓ వింత సలహా ఇచ్చారు. ఎన్నికల్లో గెలవాలంటే చక్కర తక్కువ తినాలని సూచించారు. ఇంతకీ ఎవరా లీడర్.? ఎన్నికల్లో గెలవాడనికి, చక్కరకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా.? అయితే దీనిపై క్లారిటీ రావాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరో ఆరు నెలలో యుద్ధభేరీ మోగనుంది. దీంతో అధికార పార్టీ మొదలు ప్రతి పక్షాల వరకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వరుసగా కీల నిర్ణయాలు తీసుకుంటూ దూకుడు పెంచుతుంటే.. కాంగ్రెస్, బీజేపీలో అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే పార్టీ క్యాడర్‌తో నిత్యం టచ్‌లో ఉంటూ వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేత ఒకరు కార్యకర్తలకు వింత సూచన చేశారు. వివరాల్లోకి వెళితే..
ఆయన తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ. వచ్చే ఎన్నికల్లో కాషాయ పార్టీ నుంచి పోటీ చేయడానికి కసరత్తు చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్య పార్టీ మీటింగ్స్ లో హెల్త్ క్లాసులు చెప్తున్నారు. షుగర్ మానేస్తే… అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. ఇంతకీ షుగర్ కి అధికారానికి సంబంధం ఎంటి ? షుగర్ మానేస్తే అధికారంలోకి వస్తామని చెప్పిన ఆ నాయకుడు గురించి హాట్ టాపిక్‌గా మారింది. చేవెళ్ల మాజీ ఎంపి. ఇటీవలే బీజేపీలో చేరిన ఈయన వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కార్యకర్తలతో తరుచూ సమావేశమవుతున్నారు. ఆ సమావేశాల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. కార్యకర్తలకు హెల్త్ క్లాసులు చెబుతున్నారట. షుగర్ తో అనేక రోగాలు వస్తున్నాయి..షుగర్ ను పక్కన పెట్టాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు.




షుగర్ తీసుకుంటే మెదడు మొద్దు బారుతుందని… గెలవాలనే తపన ఉండదని కొండా తన పొలిటికల్ మీటింగ్స్ లో కార్యకర్తలకు ఆరోగ్య సూచనలు చేస్తున్నారట. దీనిపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కూడా చర్చ జరిగింది. సమావేశాల్లో చాయ్ కి బదులుగా వేడినీళ్లు ఇచ్చి కార్యకర్తలను ఉత్తేజ పరచాలని కమలనాథులు భావిస్తున్నారట. మొత్తానికి ఎన్నికల్లో గెలుపు సంగతి ఏమో కానీ.. షుగర్ తగ్గిస్తే ఆరోగ్యానికి మాత్రం మేలు జరుగుతుందని మాత్రం అనుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..